Chakotra Fruit Benefits: రాత్రి పడుకునే ముందు ఈ పండు తింటే 45 రోజులు షుగర్‌ కంట్రోల్‌.. ఇది ఎక్కడ దోరికిన వదలకండి!

Home Remedies For Blood Sugar Control: పంపర పనస అనే పండు రుచికరంగా ఉండటమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. ఇది నిమ్మజాతికి చెందిన పండు. ఇందులో విటమిన్‌ సి అధికంగా ఉంటుంది. ఈ పండు ఉష్ణమండల ప్రాంతాల్లో ఎక్కువగా పండుతుంది. అయితే ఈ  పండును రాత్రి పడుకొనే ముందు లేదా బ్రేక్‌ ఫాస్ట్‌లో తినడం వల్ల ఆరోగ్యానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా డయాబెటిస్‌, అధిక బరువు, పొట్టు కొవ్వు నుంచి ఉపశమనం పొందవచ్చు. 
 

1 /6

పంపర పనస అనే పండు రుచికరంగా ఉండే ఒక అద్భుతమైన పండు. ఇది చూడడానికి పసుపు రంగులో ఉంటుంది. ఇది ఎక్కువగా ఉష్ణమండల ప్రాంతాల్లో పండుతుంది. ఇందులో బోలెడు ఆరోగ్యకరమైన గుణాలు ఉంటాయి. ఇది డయాబెటిస్, అధిక బరువు వంటి సమస్యలకు చెక్‌ పట్టడంలో సహాయపడుతుంది. 

2 /6

పంపర పనస పండు పులుపు, వగరు, తీపి రుచుల కలయికతో ఉంటుంది. ఇందులో విటమిన్‌ సి పుష్కలంగా లభిస్తుంది. దీని వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాం.   

3 /6

ప్రతిరోజు ఉదయం లేదా నిద్ర పోయే ముందు ఈ పండును తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. గుండె సమస్యలతో బాధపడవారికి కూడా మేలు చేస్తుంది. క్యాన్సర్ కణాల వృద్ధిని నిరోధించే గుణాలు కలిగి ఉంది.  

4 /6

 ఆరోగ్యనిపుణులు ప్రకారం నెలకోసారి అయిన ఈ పండును తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారని చెబుతున్నారు. ముఖ్యంగా 45 రోజుల పాటు దీని తినడం వల్ల బ్లడ్‌ షుగర్ లెవెల్స్‌ అదుపులో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. 

5 /6

పంపర పనస డయాబెటిస్ ఉన్నవారికి ఆరోగ్యకరమైన ఎంపికగా వైద్యులు సూచిస్తారు. ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది.

6 /6

 విటమిన్ సి, పొటాషియం వంటి ఇతర పోషకాలు మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కాబట్టి దీని తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. అయితే ఏదైనా పండును తినే ముందు వైద్యల సలహా తీసుకోవడం చాలా అవసరం.