Side Effects of Beetroot: బీట్‌రూట్‌తో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఇందులో మన శరీర ఆరోగ్యానికి సంబంధించిన అన్ని విటమిన్స్, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇది పిల్లలు, పెద్దలతోపాటు అన్ని వయస్సులవారు తింటారు.
Side Effects of Beetroot: బీట్‌రూట్‌తో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఇందులో మన శరీర ఆరోగ్యానికి సంబంధించిన అన్ని విటమిన్స్, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇది పిల్లలు, పెద్దలతోపాటు అన్ని వయస్సులవారు తింటారు. దీంతో కంటి, మెదడు ఆరోగ్యం కూడా బాగుంటుంది. కేవలం ఆరోగ్యపరంగానే కాదు సౌందర్య సాధనాల్లో కూడా బీట్‌రూట్‌ను వినియోగిస్తారు. అయితే, కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు బీట్‌రూట్ తినకూడదు. ఇది వారికి విషం వంటిది. అందుకే వీరు బీట్‌రూట్ అస్సలు తినకూడదని వైద్యులు సూచిస్తున్నారు. ఆ వివరాలు తెలుసుకుందాం.
హైబీ ఉన్నవారు లేదా లోబీపీతో బాధపడేవారు కూడా బీట్‌రూట్ అస్సలు తినకూడదు. ఎందుకంటే బీట్‌రూట్‌లో ఉండే నైట్రేట్లు రక్తనాళాలను విస్తరించి రక్తపోటును తగ్గించేస్తాయి. అందుకే బీట్‌రూట్ తినకుండా ఉండటమే మేలు. రక్తపోటు సమస్య ఉన్నవారు బీట్‌రూట్ తీసుకుంటే మైకంగా ఉంటుంది. దీనికి వెంటనే మందులు తీసుకుంటే సరిపోతుంది. కానీ, బీట్‌రూట్ తినడానికి ఒకటికి వేయిసార్లు ఆలోచించండి.
ముఖ్యంగా కిడ్నీల్లో రాళ్ల సమస్యను అనుభవిస్తున్నవారు బీట్‌రూట్‌కు దూరంగా ఉండాలి. ఎందుకంటే బీట్‌రూట్ లో ఉండే ఆక్సలేట్స్ మూత్రంలో స్ఫటికలను తయారు చేస్తుంది. దీంతో అవి మూత్రపిండాల్లో రాళ్ల సమస్యను తీసుకువస్తాయి. అందుకే యూరిన్ ఇన్పెక్షన్, కడ్నీల్లో రాళ్ల సమస్యలు ఉన్నవారు బీట్‌రూట్‌కు దూరంగా ఉండాలి.
బీట్‌రూట్ అలెర్జీ సమస్యలతో బాధపడేవారు కూడా తినకూడదు. ఇది దుంపకూర. అలెర్జీ సమస్య ఉన్నవారి శరీరం ఆక్సలేట్లను జీర్ణించుకోలేదు. ఇది తిన్న తర్వాత దురద ఎక్కువవుతుంది. ఇలా జరిగితే వెంటనే వైద్యులను సంప్రదించాలి. అంతేకాదు మీకు ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే దానికి తగిన ఆహారం తీసుకోవడానికి ప్రయత్నించండి.
బీట్ రూట్ కడుపు సంబంధిత సమస్యలతో బాధపడేవారు కూడా తీసుకోకుండా జాగ్రత్తపడాలి. ఎందుకంటే ఇది వారికి మంచిది కాదు. ఇతర అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది. బీట్‌రూట్‌లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది కడుపులో గ్యాస్, అజీర్తి సమస్యలకు దారితీస్తుంది.
అయితే, బీట్‌రూట్ జ్వరం, మలబద్ధకం సమస్యలను నయం చేస్తుంది. శరీరంలో మంట ఉన్నవారికి బీట్‌రూట్ మంచి మందు. రక్తప్రసరణను మెరుగుపరచి గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది. బీట్‌రూట్ మంచి ఆస్ట్రింజెంట్ గా పనిచేస్తుంది. తద్వారా ఇది పిత్త ఉపశమన లక్షణాలను కలిగి ఉంది. (Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )