Telangana TET 2025 Examination Center Issue: జనవరి 2 నుంచి 20 వరకు తెలంగాణ టెట్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన హాల్ టికెట్స్ కూడా ఇటీవల విడుదల చేశారు.. అయితే టెట్ కి సంబంధించి అభ్యర్థులకు ఓ తలనొప్పి మొదలైంది. సెంటర్ విషయంలో ఇబ్బందులు తప్పడం లేదు. ఫస్ట్ ప్రయారిటీ కాకుండా లాస్ట్ ప్రయారిటీ కి కేంద్రాలు కేటాయించారు.
టెట్ అభ్యర్థులకు బిగ్ షాక్ ఫస్ట్ ప్రయారిటీ కాకుండా లాస్ట్ ప్రయారిటీ ఇచ్చిన జిల్లాల పరీక్షా కేంద్రాలు కేటాయించడంతో వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తెలంగాణ టెట్ ఎగ్జామ్ జనవరి 2వ తేదీ నుంచి 20 వరకు నిర్వహించనున్నారు.. దీనికి సంబంధించిన హాల్ టికెట్లు కూడా విడుదల చేశారు.
అయితే దరఖాస్తు చేసుకునే సమయంలో అభ్యర్థులకు పరీక్ష కేంద్రాల ప్రయారిటీలు ఉంటాయి. అయితే మొదటి ప్రాధాన్యత కాకుండా లాస్ట్ ప్రయారిటీకి సెంటర్లు కేటాయించడంతో అభ్యర్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ఎగ్జామ్ కి మొదటి ప్రాధాన్యత లేదా రెండో ప్రాధాన్యత కేంద్రాలు కేటాయిస్తారు. కానీ చివరి ప్రాధాన్యత ఇవ్వడంతో వారు ఆందోళన చెందుతున్నారు,
ఇక పరీక్ష చాలా దూరం ప్రయాణించి ఎగ్జామ్ రాయాల్సి వస్తుందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సెంటర్ దగ్గరలో ఉంటే సమయం కలిసి వచ్చేదని అంటున్నారు. ఇదిలా ఉండగా 11, 20 తేదీల్లో నిర్వహించే పరీక్షకు ఈరోజు హాల్ టికెట్లు వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని అధికారులు ప్రకటించారు.
తెలంగాణ టెట్ ఎగ్జామ్ ఉదయం 9 నుంచి 11:30 వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4:30 వరకు రెండు సెషన్లలో నిర్వహిస్తున్నారు. అయితే అభ్యర్థులు గంటన్నర ముందే పరీక్ష కేంద్రాన్ని చేరుకోవాలి. ఎగ్జామ్ ప్రారంభానికి 15 నిమిషాల ముందు గేట్లు మూసివేయనున్నారు. తప్పనిసరిగా హాల్ టికెట్ తో పాటు బ్లాక్ లేదా బ్లూ బాల్ పాయింట్ పెన్ తీసుకొని గుర్తింపు కార్డుతో పరీక్ష కేంద్రానికి వెళ్లాలి.
అయితే అభ్యర్థులు తమతోపాటు ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకుని వెళ్లడానికి అనుమతి లేదు. కాగా, జనవరి 8, 9, 19, 18 తేదీల్లో పేపర్ 1 పరీక్ష నిర్వహించగా, పేపర్ 2 పరీక్షలు జనవరి 2, 5, 11, 12, 19, 20 తేదీల్లో నిర్వహిస్తున్నారు.
ఈ టెట్ పరీక్షకు సంబంధించిన ఫలితాలను ఫిబ్రవరి 5న ప్రకటిస్తారు. టెత్ పరీక్షకు మొత్తంగా 2,48,170 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు.