Telangana Fimily Digital Card: తెలంగాణలో ప్రతి కుటుంబానికి డిజిటల్ కార్డు పేరుతో రేషన్, ఆరోగ్య సేవల కోసం ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ అందుబాటులోకి తీసుకురాబోతున్నట్టు ప్రకటించింది రేవంత్ రెడ్డి సర్కారు. దానికి సంబంధించిన అప్లికేషన్ ను తాజాగా ఆన్ లైన్ లో విడుదల చేసింది.
తెలంగాణలో గతేడాది వివిధ హామిల పథకాలతో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటికే గృహ జ్యోతి పథకం, ఫించన్ వంటి వాటికి అధికారంలోకి వచ్చిన అప్లికేషన్స్ తీసుకున్న కాంగ్రెస్ సర్కారు..తాజాగా ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డు పేరుతో కొత్త డిజిటల్ కార్డును అందుబాటులోకి తీసుకురాబోతుంది. దానికి సంబంధించిన ఆన్ లైన్ లో విడుదల చేసింది.
డిజిటల్ కార్డ్ అప్లికేషన్స్ ను దసరా నుంచి ప్రజల స్వీకరించనున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. తుది దశకు చేరుకున్న డిజిటల్ కార్డుతో ఎలాంటి ఉపయోగాలున్నాయో చూద్దాం..తెలంగాణ సర్కార్ ఏర్పాటు కాగానే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని అన్ని వర్గాలకు వర్తింపజేసింది. ఆ తర్వాత కొంత మందికి మాత్రమే రూ. 500 గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తోంది.
ఉచిత బస్సు ప్రయాణం అన్ని వర్గాలకు తెలంగాణకు సంబంధించిన మహిళలకు కల్పించారు. కానీ మిగతా సంక్షేమ పథకాలకు రేషన్ కార్డుతో లింక్ పెట్టారు. అయితే మన రాష్ట్రంలో అర్హులైన ఎంతో మంది నిరుపేదలు రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు రేషన్ కార్డుతో ఎలాంటి అసవరం లేని బడా బాబుల దగ్గర మాత్రం ఈ కార్డులున్నాయి.
తాజాగా తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. ఫ్యామిలీ డిజిటల్ కార్డును తీసుకొచ్చింది. ఇందులో మహిలను ఇంటి ఓనర్ గా గుర్తిస్తారట. ఈ కార్డుతో రేషన్, పింఛను, ఆరోగ్య ఇతర పథకాలను ఈజీగా పొందవచ్చని చెబుతున్నారు. అర్హులందరికీ ఒకే రాష్ట్రం ఒకే కార్డుతో ముందుకు తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించిన సర్వే కూడా ప్రభుత్వం మొదలు పెట్టింది.
రానున్న రోజుల్లో అన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సర్వే చేయనున్నారు. అధికారులు ఇంటింటికి వెళ్లి ఫ్యామిలీ యజమాని మహిళతో పాటు ఇతర కుటుంబ సభ్యుల వివరాలను సేకరించనున్నారు. ఆ వివరాలతో ఆ కుటుంబానికి ఓ క్యూర్ కోడ్ కేటాయిస్తారు. దీని ద్వారానే అర్హత కలిగిన వారికి పథకాలు అందజేయనున్నారు.
ఫ్యామిలీ డిజిటల్ కార్డు పేరుతో సక్రమ కుటుంబ సర్వే చేపట్టనున్నారు. దీని కోసం కుటుంబ సభ్యుల ఫోటోను తీసుకోనున్నారు. ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డు ను స్కాన్ చేయడంతోనే వాళ్లు ఏ పథకానికి అర్హులో సులభంగా తెలుస్తుంది. క్యూఆర్ కోడ్ వల్ల సైబర్ మోసాలు జరిగే అవకాశాలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇది ఎంత వరకు అమలు చేయనుందో చూడాలి.
ఇప్పటికే ఇలాంటి పథకం పలు రాష్ట్రాల్లో అమలు అవుతున్నాయి. దాని అమలు తీరును అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. దేశంలోని నాలుగు రాష్ట్రాలు ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చాయి. దీని ఆధారకంగా క్యూఆర్ కోడ్ కేటాయిస్తారు.