Rinku singh: టీమిండియా క్రికెట్ ప్లేయర్ రింకు సింగ్ సమాజ్ వాది పార్టీ ఎంపీతో నిశ్చితార్థం శుక్రవారం ఘనంగా జరిగింది. కొద్ది మంది బంధువులు, స్నేహితుల మధ్య ఈ వేడుకు జరిగింది.
ఉత్తర ప్రదేశ్ కు చెందిన సమాజ్ వాది ఎంపీ ప్రియాసరోజ్ ఎంగెజ్ మెంట్ క్రికెటర్ రింకూసింగ్ తో జరిగింది. ఈ క్రమంలో వీరిద్దరు చాలా రోజులుగా డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో వీరిద్దరు ఎంగెజ్ మెంట్ చేసుకుని అందర్ని షాక్ కు గురిచేశారు.
అయితే.. రింకూ సింగ్, ప్రియాలు ఈ వేడుకను సీక్రెట్ గా ఉంచారు . కానీ రింకు సింగ్ స్నేహితులు వీరి ఎంగెజ్ మెంట్ విషయాల్ని అందరికి తెలిసేలా పోస్టులు పెట్టారు. దీంతో వీరికి సోషల్ మీడియాలో అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
మరోవైపు దీనిపై ఇరుకుటుంబాలు మాత్రం అధికారికంగా స్పందించాల్సి ఉంది. ప్రియా సరోజ్ ఇటీవలే మచ్లిషహర్ లోకసభ నియోజకవర్గం నుంచి సమాజ్‌వాదీ పార్టీ తరఫున ఎంపీగా ఎన్నికయ్యారు. అతి పిన్న వయసులో.. 25 ఏళ్ల వయసులోనే ఎంపీగా ఎన్నికైన సభ్యురాలిగా ఆమె రికార్డ్ క్రియేట్ చేశారు.
ప్రియా సరోజ్.. ఢిల్లీ వర్సిటీలో చదివి సుప్రీం కోర్టు లాయర్‌గా కూడా పనిచేశారు. ప్రియా సరోజ్ కుటుంబానికి పొలిటికల్ నేపథ్యం ఉంది. వీరి కుటుంబానికి ప్రజల్లో మంచి ఆదరణ ఉంది.
ఆమె తండ్రి తుఫానీ సరోజ్ మచ్లిషహర్ నియోజకవర్గం నుంచే వరుసగా మూడు సార్లు 1999, 2004, 2009లో ఎంపీగా గెలిచి రికార్డు క్రియేట్ చేశారు. ఆయన రాజకీయ వారసత్వాన్ని ప్రియా సరోజ్ కొనసాగిస్తున్నారు.
ఇక.. రింకూ సింగ్ విషయానికి వస్తే.. టీమిండియాలో తనదైన స్టైల్ లో రాణిస్తున్నారు. ఎంతో కష్టపడి.. స్టార్ ప్లేయర్ గా ఎదిగాడు. ఐపీఎల్ లో మంచి ప్రదర్శనను కనబర్చారు. గత రెండేళ్లుగా అతను టీ20 ఫార్మాట్‌లో టీమిండియాకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.