Suvarna Raja Yogam Effect: సువర్ణ రాజయోగం ఎఫెక్ట్.. ఈ రాశుల వారికీ రాబోయే 25 యేళ్లు రాజభోగాలే..

Suvarna Raja Yogam Effect: సువర్ణ రాజయోగం.. గ్రహ మండలంలో కొన్ని గ్రహాల కలయికతో అద్భుత యోగాలు ఏర్పడతాయి. అలాంటి అరుదైన సువర్ణ రాజయోగం ఈ నెల 18న కలగబోతుంది ముఖ్యంగా కన్య రాశిలో రవి, శుక్ర, కేతువుల కలయికతో త్రిగ్రాహి.. సువర్ణ రాజయోగంగా అభివర్ణిస్తారు.  దీంతో మొత్తం 12 రాశుల్లో 6వ రాశుల వారికీ రాబోయే 25 యేళ్లు అన్ని రాజభోగాలే అనుభవిస్తారని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

1 /7

మేష రాశి.. సువర్ణ రాజయోగం వల్ల మేష రాశి పంట పండినట్టే. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న డబ్బు చేతికి అందుతుంది. పూర్వీకుల ఆస్తులు కలిసొచ్చే అవకాశాలున్నాయి. ఇల్లు, కారు, భూమి కొనుగోలు చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇప్పటి వరకు చేసిన అప్పులన్ని తీర్చేస్తారు.

2 /7

వృషభ రాశి.. ఇప్పటి వరకు అనుభవించిన కష్టాల నుంచి గట్టకెక్కుతారు. చేసిన అప్పులు తీరుస్తారు. విలాసవంతమైన జీవితం అనుభవిస్తారు. పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా జీవితం సాగిపోతు ఉటుంది. వివాహాం కానీ స్త్రీ, పురుషులకు వివాహా యోగం ఉంది.

3 /7

మిథున రాశి.. మిథున రాశి వారికీ ఈ యేడాది అద్భుత వివాహా యోగం ఉంది. సరైన అమ్మాయి లేదా అబ్బాయితో వివాహాం జరిగే అవకాశాలున్నాయి. అంతేకాదు దైవానుగ్రహం వల్ల మంచి ఉద్యోగంలో సెటిల్ అవుతారు. గృహ నిర్మాణం కలిసొచ్చే అవకాశాలున్నాయి.

4 /7

సింహ రాశి.. సింహ రాశి వారికీ ఈ కాలం అద్భుత యోగాలను ఇస్తుంది. అంతేకాదు అంచెలంచెలుగా మీరు కోరుకున్న స్థానాన్ని దక్కించుకుంటారు. ఏ పనిచేసినా అందులో విజయం సాధిస్తారు. వివాహా ప్రయత్నాలు ఫలించే అవకాశాలున్నాయి.

5 /7

ధనుస్సు.. ధనుస్సు రాశి వారు గత కొన్నేళ్లుగా అనుభవిస్తన్న కష్టాలు పటాపంచలవుతాయి. అయితే గత కొన్నేళ్లుగా పడుతున్న కష్టాలను అధిగమిస్తారు. జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురు అవుతాయి. శతృవులు మీ ముందు మోకరిల్లుతారు.

6 /7

కుంభ రాశి.. కుంభ రాశి వారికీ  ఇది బంగారు కాలం. మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశాలు మెండుగా ఉంటాయి. జీవితంలో సంతోషం రెట్టింపు అవుతుంది. అంతేకాదు ఉద్యోగ, వివాహా ప్రయత్నాలు ఫలమిస్తాయి.

7 /7

గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటర్నెట్, జ్యోతిష్యులు ప్రస్తావించిన అంశాలనే మేము ప్రస్తావించాము. ZEE News దీనికి ధృవీకరించడం లేదు.