Kumbh mela 2025: కుంభమేళలో అనుకొని ఘటన..స్టీవ్ జాబ్స్ సతీమణికి తీవ్ర అస్వస్థత.. అసలేం జరిగిందంటే..?

Laurence Powell falls sick: స్టీవ్ జాబ్స్ సతీమణి లారెన్స్ పావెల్ ఒక్కసారిగా అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆమె ప్రస్తుతం శిబిరంలో చికిత్స తీసుకుంటున్నట్లు స్వామిజీలు వెల్లడించారు.
 

1 /6

పవిత్రమైన కుంభమేళ ఉత్సవం ప్రయాగ్ రాజ్ లో ప్రారంభమైంది. నిన్న పుష్య పౌర్ణమి నేపథ్యంలో మొదటి షాహీ స్నానంను భక్తులు ఆచరించారు. ప్రపంచం నలుమూలల నుంచి సాధుసంతులు, అఘోరీలు, నాగ సాధులు, భక్తులు భారీగా తరలిస్తున్నారు.

2 /6

ప్రయాగ్ రాజ్ లో ఎక్కక కూడా భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా మోదీ సర్కారు కట్టుదిట్టమైన భద్రత చేపట్టింది. ఈ నేపథ్యంలో 144 సంవత్సరాల తర్వాత అపూర్వమైన మహా కుంభమేళలో స్నానం ఆచరించేందుకు కోట్లాది భక్తులు యూపీ బాటపట్టారు.  

3 /6

ఇప్పటికే యూపీ అంతట.. భారత్ తో పాటు.. విదేశీయులు కూడా కన్పిస్తున్నారు. ఈ కుంభమేళలో 14 అఖాడాలకు చెందిన  సాధువులు వస్తున్నారు. అంతే కాకుండా.. హిమాలయాల్లో ఉన్న స్వామిజీలు, అఘోరీలు ఒక్కొక్కరుగా ప్రయాగ్ రాజ్ వచ్చి కుంభమేళలో పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు.  

4 /6

ఇదిలా ఉండగా.. దివంగత స్టీవ్ జాబ్స్ సతీమణిన లారెన్ పావెల్ సైతం.. కుంభమేళకు వచ్చారు. ఆమె ముఖ్యంగా.. కైలాస నందగిరి మహారాజ్ ను తన  ఆధ్యాత్మిక గురువుగా భావిస్తారు. అంతేకాకుండా.. ఆమె కొన్నిరోజుల పాటు ప్రయాగ్ రాజ్ లో ఉండి..పూజల్లో పాల్గొంటారని అక్కడి వాళ్లు వెల్లడించారు.

5 /6

ఈ క్రమంలో స్టీవ్ జాబ్స్ సతీమణి లారెన్ పావెల్ అనుకొని విధంగా తీవ్ర అస్వస్థకు గురయ్యారు. ఆమె చలితో వణికిపోతున్నారని అక్కడి వారు తెలిపారు. మొదటి షాహీ స్నానంను ఆచరించారని.. దీనితో ఆమె అలర్జీకి గురయ్యారు. ప్రస్తుతం ఆమె రెస్ట్ లో ఉన్నారు.  

6 /6

ప్రస్తుతం లారెన్ పావెల్ శిబిరంలో చికిత్స తీసుకుంటున్నాని.. ఆమె కుదుట పడిన తర్వాత మళ్లీ కుంభమేళలో స్నానం ఆచరిస్తారని కూడా.. కైలాస నందగిరి మహారాజ్ శిష్యులు వెల్లడించారు. మరోవైపు ఇటీవల లారెన్ పావెల్ పేరును కమలగా మఠంలో మార్చిన విషయం తెలిసిందే.