Naga Chaitanya - Sobhita: చైతన్య - శోభిత మధ్య ప్రేమకు కారణం ఆ స్టార్ హీరో..ఎవరంటే..?

Sobhita love story: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నాగచైతన్య , సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో పెళ్లైన నాలుగేళ్లకే వివాహం కాస్త పెటాకులయ్యింది.అలా విడాకులు తీసుకొని ఎవరి దారి వారు చూసుకున్నారు. ఇక ఇప్పుడు శోభితాను వివాహం చేసుకోవడానికి సిద్ధమయ్యారు నాగచైతన్య.
 

1 /5

నాగచైతన్య ప్రేమించి, పెళ్ళి చేసుకున్న సమంత నుంచి విడాకులు తీసుకున్నారు.  అనంతరం సమంత ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. మయోసైటిస్ వ్యాధి బారిన కూడా పడింది. అయితే ఆమె సంగతి అటు ఉంచితే ఇటు నాగచైతన్య కూడా భార్యకు దూరమైన తర్వాత ఎంతో మానసిక వేదన అనుభవించారట. ఆ సమయంలో ఆయనకు సపోర్టుగా నిలిచారట శోభిత ధూళిపాల.   

2 /5

ఇకపోతే నాగచైతన్యకు శోభిత పరిచయం అవడానికి కారణం ప్రముఖ హీరో అడవి శేష్ అంటూ ఒక వార్త తెరపైకి వచ్చింది. ఇకపోతే శోభిత అడవి శేష్ కలిసి రెండు సినిమాల్లో నటించారు. గూడచారి , మేజర్ అనే సినిమాలలో వీరిద్దరూ జంటగా నటించిన విషయం తెలిసిందే. ఇక గూడచారి సినిమాలో నాగార్జున మేనకోడలు సుప్రియ యార్లగడ్డ కీలకపాత్ర పోషించారు.  ఈ సినిమా షూటింగ్ చూద్దామని వెళ్లినా, నాగచైతన్యకి శోభిత ను పరిచయం చేశారట అడివి శేష్. దీనికి తోడు మరోవైపు సుప్రీత -  అడవి శేషు మధ్య ఏదో ఉందనే వార్తలు ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉంటాయి.

3 /5

ఇక అలా అడివి శేష్ నాగచైతన్యకు శోభితను పరిచయం చేయడంతో వారిద్దరు చాలా సన్నిహితంగా ఉండేవారట.  అదే సమయంలో భార్య నుంచి దూరమైన చైతన్య డిప్రెషన్ లోకి వెళ్ళినప్పుడు శోభిత దగ్గరుండి మరీ ఆయనను ఆ డిప్రెషన్ నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేసినట్లు సమాచారం. 

4 /5

ఇక దీంతో ఆమె ప్రేమకు కనెక్ట్ అయిన నాగచైతన్య స్వయంగా శోభితకు ప్రపోజ్ చేశారట. ఇక ఆమె కూడా ఇతడు ప్రేమను అంగీకరించి పెళ్లికి సిద్ధమైనట్లు సమాచారం. ఏది ఏమైనా నాగచైతన్య,  శోభిత మధ్య ప్రేమ పుట్టడానికి కారణం ఒకరకంగా అడవి శేష్ అంటూ నెట్టింట ఒక వార్త ఇప్పుడు హల్చల్ చేస్తోంది. 

5 /5

ఇకపోతే వీరిద్దరి వివాహం ఈనెల ఆఖరిలో అన్నపూర్ణ స్టూడియోలో జరగబోయే అవకాశాలున్నట్లు సమాచారం. ఇప్పటికే శోభిత ఇంట్లో పసుపు దంచడం, గోధుమ రాయి వంటి పనులు పూర్తయిన విషయం తెలిసిందే.