Sridevi Top Tollwood Movies: ‘అతిలోకసుందరి’ అనే పదానికి అసలు సిసలు నిర్వచనం శ్రీదేవి. అంతేకాదు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వయా కోలీవుడ్ వరకు దాదాపు మూడు జనరేషన్ హీరోలతో యాక్ట్ చేసిన ఏకైక భారతీయ హీరోయిన్ గా శ్రీదేవి రికార్డును బ్రేక్ చేయడం ఎవరికీ సాధ్యం కాదు. ఈమె కెరీర్ లో పలు బ్లాక్ బస్టర్ చిత్రాలున్నాయి. అందులో కొన్ని బ్లాక్ బస్టర్ చిత్రాల విషయానికొస్తే..
మొత్తంగా శ్రీదేవి కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలున్నాయి. అందులో కొన్ని చిత్రాలను మాత్రమే ప్రస్తావించాము. మరోవైపు ఈమెకు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో పలు బ్లాక్ బస్టర్ చిత్రాలు ఆమె ఖాతాలో ఉన్నాయి.
జగదేకవీరుడు అతిలోకసుందరి: కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మక వైజయంతి మూవీస్ బ్యానర్ పై చిరంజీవి, శ్రీదేవి టైటిల్ రోల్స్ లో నటించిన చిత్రం ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’. ఈ చిత్రం తెలుగు సినీ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కమ్ ఇండస్ట్రీ హిట్ మూవీగా నిలిచిపోయింది.
ఆఖరి పోరాటం: వైజయంతీ మూవీస్ బ్యానర్ పై కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో నాగార్జున హీరోగా నటించిన చిత్రం ‘ఆఖరి పోరాటం’. ఈ సినిమాలో శ్రీదేవి హీరోతో సమానమైన పాత్ర చేసింది. సినిమా మొత్తం ఆమె భుజస్కందాలపైనే నడుస్తోంది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
త్రిశూలం : రెబల్ స్టార్ కృష్ణంరాజు హీరోగా కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘త్రిశూలం’. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్నే అందుకుంది.
దేవత: కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో శోభన్ బాబు హీరోగా శ్రీదేవి టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘దేవత’. ఈ సినిమా అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
కిరాయి కోటీగాడు: సూపర్ స్టార్ కృష్ణతో శ్రీదేవి ఎక్కువ చిత్రాల్లో కథానాయికగా నటించింది. అందులో పలు హిట్ చిత్రాలున్నాయి. అందులో ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘కిరాయి కోటీగాడు’సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
ప్రేమాభిషేకం : హీరోగా అక్కినేని నాగేశ్వరరావు పనైపోయింది ఆయన కథానాయకుడిగా రిటైర్మెంట్ ప్రకటించాల్సిందే అనే టైములో దాసరి నారాయణ రావు దర్శకత్వంలో శ్రీదేవి హీరోయిన్ గా నటించిన సినిమా ‘ప్రేమాభిషేకం’. ఈ సినిమా పలు కేంద్రాల్లో యేడాదికి పైగా నడిచి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
బొబ్బిలి పులి: దాసరి నారాయణ రావు దర్శకత్వంలో ఎన్టీఆర్, శ్రీదేవి హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది. పలు రికార్డులను తిరగరాసింది.
వేటగాడు: అన్న ఎన్టీఆర్ కు మనవరాలిగా నటించిన శ్రీదేవి.. ఆ తర్వాత కొన్నేళ్లకే ఆయన సరసన కథానాయికగా నటించిన తొలి చిత్రం ‘వేటగాడు’. కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
పదహారేళ్ల వయసు : కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో చంద్రమోహన్, మోహన్ బాబు హీరోలుగా నటించిన సినిమా ‘పదరాహారేళ్ల వయసు’. ఈ చిత్రం శ్రీదేవి కెరీర్ లో ఫస్ట్ బ్లాక్ బస్టర్ అని చెప్పాలి. ఈ సినిమా తర్వాత అతిలోకసుందరి వెనుదిరిగి చూసుకోలేదు.