Sreemukhi:శ్రీముఖికి బాలీవుడ్ బంపరాఫర్.. త్వరలో ఆ స్టార్ హీరో సినిమాతో హిందీలో పాగా..

Sreemukhi: శ్రీముఖికి బాలీవుడ్ లో బంపరాఫర్ వచ్చిందా.. త్వరలో హిందీలో అడుగుపెట్టబోతుందా అంటే ఔననే అంటున్నాయి బీ టౌన్ వర్గాలు.

1 /6

శ్రీముఖి గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు టెలివిజన్ వ్యాఖ్యాతగా  తనదైన శైలిలో ప్రేక్షకులను మనసులను దోచుకుంది.

2 /6

అంతేకాదు యాంకర్‌గా త‌న‌ కంటూ ఓ సెపరేట్  ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ప్రస్తుతం శ్రీముఖి ఓ వైపు సినిమాలు.. మరోవైపు టీవీ ప్రోగ్రామ్స్ తో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ తో అలరిస్తోంది.

3 /6

  శ్రీముఖి  వీలు చిక్కినపుడల్లా తన అందాలతో అదుర్స్ అనిపిస్తోంది. అంతేకాదు టీవీ యాంక‌ర్ గా ఆమె కంటూ సెపరేట్ ఐడెండిటీ ఏర్పరుచుకుంది. అంతేకాదు ప్రస్తుతం సినిమాల్లో కథానాయికగా నటిస్తూనే సైడ్ క్యారెక్టర్స్ తో  సత్తా చూపెడుతోంది శ్రీముఖి.

4 /6

అప్పట్లో నాగార్జున తొలిసారి హోస్ట్ చేసిన బిగ్‌బాస్ 3 రియాలిటీలో తెలుగులో రన్నరప్‌గా నిలిచింది. ఈ రియాలిటీ షోలో రాహుల్ సిప్లిగంజ్ విన్నర్ గా నిలిచాడు.

5 /6

  గతేడాది చిరంజీవి హీరోగా నటించిన ‘భోళా శంకర్’ మూవీలో శ్రీముఖి ప్రముఖ పాత్రలో నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది.  

6 /6

తాజాగా ఈమె ప్రముఖ బాలీవుడ్ అగ్ర హీరో నటిస్తున్న సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలో నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.