Sprouted Wheat: మొలకెత్తిన గోధుమల మిరాకిల్స్‌.. ఇంట్లో తయారు చేసుకోవడం ఎలా?

Sprouted Wheat benefits: సాధారణంగా మనం గోధుమలతో చేసిన చపాతీలను తింటాం. దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అయితే, మీరు ఎప్పుడైనా మొలకెత్తిన గోధుమలను మీ డైట్లో చేర్చుకున్నారా? దీంతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
 

1 /5

బలమైన ఎముకలు.. మొలకెత్తిన గోధుమలు తీసుకోవడం వల్ల ఎముకలు కూడా బలంగా మారతాయి. ఎందుకంటే ఇందులో ఎక్కువ శాతం కాల్షియం ఉంటుంది. ఇది ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. మొలకెత్తిన గింజలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎముకలు ఆరోగ్యంగా బలంగా దృఢంగా మారతాయి.

2 /5

మెరుగైన జీర్ణక్రియ.. మొలకెత్తిన గోధుమలు తీసుకోవడం వల్ల మన శరీరానికి కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం, ఐరన్  జింక్ లభిస్తాయి. పోషకాలు అందుతాయి. జీర్ణక్రియ సైతం మెరుగుపడుతుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఏ, బీ, ఇ కూడా పుష్కలం. 

3 /5

బరువు పెరగరు.. మొలకెత్తిన గోధుమలు డైట్లో చేర్చుకుంటే మీ కడుపు ఎక్కువ సమయంపాటు నిండిన అనుభూతిని కలిగి ఉంటుంది. ఎందుకంటే మొలకెత్తిన గోధుమలను తినడం వల్ల శరీరంలో జీవక్రియ పెరుగుతుంది. దీంతో అతిగా తినకుండా ఉంటారు. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. 

4 /5

పోషకాలు పుష్కలం.. మొలకెత్తిన గోధమల్లో పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. దీంతో మన శరీర పనితీరు కూడా మెరుగ్గా ఉంటుంది. ముఖ్యంగా ఇందులో విటమిన్లు, మినరల్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. అందుకే మన డైట్లో మొలకెత్తిన గోధుమలను ఎదోవిధంగా చేర్చుకునేలా చూడండి.

5 /5

మొలకెత్తిన గోధుమలు తయారీ విధానం.. ముందుగా గోధుమలను శుభ్రంగా కడిగి రాత్రి సమయంలో నానబెట్టుకోవాలి. ఉదయం ఆ నీటిని మళ్లీ మార్చి బాగా కడిగి ఓ గుడ్డ లేదా మొలకెత్తే డబ్బాల్లో గాలి చొరబడేలా చూసుకుని ఓ 12 గంటలపాటు వదిలేయాలి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )