Can diabetes take Bananas: మన దేశంలో డయాబెటిస్ రోగుల సంఖ్య నానాటికి పెరిగిపోతుంది దాదాపు పది మిలియన్ల వరకు డయాబెటిస్ రోగంతో బాధపడుతున్నారని అధ్యయనాలు తెలుపుతున్నాయి. దీనికి అనేక కారణాలు ఉన్నాయి.
ముఖ్యంగా ఫ్యామిలీ హిస్టరీ, జీవన శైలిలో మార్పులు, ఇవన్నీ ఆరోగ్య సమస్యలు కూడా కారణం కావచ్చు. డయాబెటిస్ నిర్వహించడానికి సరైన జీవనశైలి ఉండాలి. తరచూ ఎక్సర్సైజులు వంటివి చేస్తూ ఉండాలి. డయాబెటిస్‌తో బాధపడేవారు అరటి పళ్ళు తినవచ్చా? లేదా? తెలుసుకుందాం.
అరటిపళ్ళలో ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన పేగు ఆరోగ్యానికి ఎంతో ఉపకరిస్తాయి. రుచికి తీయగా ఉంటుంది. డయాబెటిక్స్ రోగులు తినకుండా ఉంటారు. తీయగా ఉన్న పండ్లు తినడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయని అనుకుంటారు. అయితే ఆరోగ్య నిపుణులు అరటి పండ్లను ప్రతిరోజు తినాలని సూచిస్తారు. డయాబెటిస్ రోగులు అరటిపండ్లను కొద్ది మొత్తంలో తీసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
సరైన జాగ్రత్తలు తీసుకుంటూ అరటి పండ్లను తమ డైట్లో డయాబెటిస్ రోగులు తమ డైట్లో చేర్చుకోవచ్చు. అరటి పండు లో కార్బోహైడ్రేట్స్ అధిక మోతాదులో ఉంటుంది గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువగానే ఉంటుంది. అయితే అరటిపండు డయాబెటిస్ రోగుల రక్తంలో చక్కెర లెవెల్స్ ను పెంచేస్తాయి. కానీ, ఇందులో ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను పెరుగనివ్వకుండా కాపాడుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.
అయితే బ్లడ్ షుగర్ లెవెల్ కంట్రోల్ చేసుకునే వాళ్లు అరటిపళ్లను ఈజీగా తినవచ్చు అని అంటున్నారు ఎందుకంటే రక్తంలో చక్కెర లెవెల్ లో హెచ్చుతగ్గులో చూసుకుంటూ అరటిపండ్లను తీసుకోవచ్చు. డైటీషియన్స్ సలహాతో డయాబెటిస్ రోగులు అరటిపండ్లను తమ డైట్లో సులభంగా చేర్చుకోవచ్చు.
డయాబెటిస్‌తో బాధపడుతున్నవారు పండిన అరటిపండు బదులు పచ్చి అరటి పండును తీసుకోవాలి ఇవి రక్తంలో చక్కెర లెవెల్స్ పెరగనివ్వవ.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )