Soaked Dal Benefits: సాధారణంగా ఎక్కువ శాతం ఇళ్లలో కందిపప్పుతో తయారు చేసుకుంటారు. అయితే, ఈ పప్పులో ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. కందిపప్పును ఉడికించే ముందు నానబెట్టి తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అవి ఏంటో తెలుసుకుందాం.
వర్క్ లైఫ్ బిజీ వల్ల ఉదయం హడావుడిగా పనులు ముగించుకుని ఆఫీసులకు వెళ్తారు. అయితే, కొన్ని ఆహారాలు నానబెట్టుకుని తీసుకోవడం వల్ల అందులోని పోషకాలు పూర్తిగా మన శరీరానికి అందుతాయి. అలాగే మనం వండుకునే పప్పు కూడా వండుకునే ముందు నానబెట్టుకోవడం వల్ల అధిక ప్రయోజనాలు పొందుతారు.
ఇలా చేయడం వల్ల పప్పులోని పోషకాలు శరీరం పూర్తిగా గ్రహిస్తుంది. ఈ పప్పులో యాంటీ న్యూట్రియేంట్లు టానిన్స్, పాలీఫెనల్స్ ఉంటాయి. మంచి జీర్ణం, ఖనిజాలు మన శరీరం గ్రహించేస్తుంది. ఇలా వండుకోవడం వల్ల మరింత పోషకంగా మారుతుంది. కందిపప్పు మాత్రమే కాదు ఏ పప్పు అయినా ఇలా నానబెట్టి ఉడికించుకోవడం వల్ల ఈ ప్రయోజనాలు పొందుతారు. పప్పుల్లో ఐరన్, జింక్, కాల్షియం ఉంటాయి.
పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం కడుపులో అజీర్తి, గ్యాస్ వంటి సమస్యలు పప్పు తినడం వల్ల కొంత మందికి వస్తాయి. పప్పు నానబెట్టి తీసుకోవడం వల్ల ఇందులోని లెక్టిన్ కంటెంట్ ఉంటుంది. ఇలా పప్పు నానబెట్టుకుని ఉడికించుకోవడం వల్ల అతి తక్కువ సమయంలో ఉడికిపోతుంది. పప్పు కూడా త్వరగా ఉడికిపోతుంది.
పప్పును నానబెట్టడం వల్ల డస్ట్ తొలగిపోతుంది. ఏ ఆహారాలు అయినా వ్యవసాయం చేసే సమయంలో మందులు ఉపయోగిస్తారు. ఇలా నానబెట్టుకోవడం వల్ల అవి అందులో నుంచి నీళ్లలోకి విడుదలైపోతాయి. ఆ తర్వాత పప్పును వాష్ చేసుకోవడం వల్ల వ్యర్థాలు తొలగిపోతాయి.
అంతేకాదు కందిపప్పు రంగు, ఆకృతి కూడా బాగుంటుంది. పప్పులు నీటిని సులభంగా గ్రహించేస్తాయి. పప్పు కూడా మృదువుగా మారుతుంది. ఇందులో కొన్ని మసాలాలు వేసుకోవడం వల్ల మరింత రుచికరంగా మారుతుంది. స్మూత్‌గా పప్పు మారుతుంది. నానబెట్టిన పప్పు వల్ల కడుపు సంబంధిత సమస్యలు రాకుండా ఉన్నాయి.