Trees Attracts Snakes: ఈ 5 చెట్లు అస్సలు నాటొద్దు, విష సర్పాల్ని ఆకర్షిస్తాయి

వర్షాకాలం ఆహ్లాదకరంగా ఉంటుంది. మొక్కలు నాటేందుకు అనువైన సమయం. అందుకే గార్డెనింగ్ ఇష్టమున్నవాళ్లు వివిధ రకాల మొక్కలు తెచ్చి నాటుతుంటారు. కానీ ఈ క్రమంలో ఈ 5 రకాల మొక్కల్ని పొరపాటున కూడా నాటవద్దు. ఈ మొక్కలు పాముల్ని ఇట్టే ఆకర్షిస్తాయి. పాములు దూరే ప్రమాదముంది జాగ్రత్త

Trees Attracts Snakes in Telugu: వర్షాకాలం ఆహ్లాదకరంగా ఉంటుంది. మొక్కలు నాటేందుకు అనువైన సమయం. అందుకే గార్డెనింగ్ ఇష్టమున్నవాళ్లు వివిధ రకాల మొక్కలు తెచ్చి నాటుతుంటారు. కానీ ఈ క్రమంలో ఈ 5 రకాల మొక్కల్ని పొరపాటున కూడా నాటవద్దు. ఈ మొక్కలు పాముల్ని ఇట్టే ఆకర్షిస్తాయి. పాములు దూరే ప్రమాదముంది జాగ్రత్త
 

1 /5

చందనం మొక్క విష పూరిత సర్పాలకు చందనం చెట్టు ఎక్కువగా ఆకర్షిస్తుంది. చందనం సువాసకు ఆకర్షితులై వచ్చి వాలే పక్షులు, కీటకాలను తినేందుకు విషపూరిత పాములు చందనం చెట్టును ఆవాసంగా మార్చుకుని నక్కి ఉంటాయి. 

2 /5

మల్లపూల పాదు మల్లెపూల మొక్క లేదా పాదు పాములకు ఇష్టమైన ఆవాసం. వీటి దట్టమైన ఆకుల కింద అవి నక్కి ఉండేందుకు చాలా అనువుగా ఉంటుంది. అంతేకాకుండా అద్భుతమైన సువాసన కలిగి ఉంటాయి. అందుకే ఇవి ఇంట్లో లేదా పెరట్లో నాటేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి

3 /5

దేవదారు చెట్టు దేవదారు చెట్టు కూడా పాముల్ని విపరీతంగా ఆకర్షిస్తుంది. ఎందుకంటే ఈ చెట్టు నుంచి సువాసన వెదజల్లుతుంటుంది. దాంతో కీటకాలు, పక్షులు వచ్చి చేరుతుంటాయి. వీటిని తినేందుకు చెట్టు పైన ఎక్కడో చోట పాములు నక్కి ఉంటాయి. 

4 /5

సైప్రస్ మొక్క సైప్రస్ మొక్క ఎక్కువ వయస్సు కలిగి ఉంటుంది. పటిష్టంగా ఉంటుంది. చాలామంది పూర్వీకుల సమాధి వద్ద వీటిని నాటుతుంటారు. అయితే ఈ చెట్టు ఆకులు దట్టంగా ఉన్నందున పాములు దాక్కునేందుకు చాలా అనువుగా ఉంటుంది. 

5 /5

సిట్రస్ ఫ్రూట్స్ మొక్క సిట్రస్ ఫ్రూట్స్ మొక్కలు కూడా పాములకు ఆవాసం. ఎందుకంటే ఈ చెట్టుపై కూడా పక్షులు , కీటకాలు పెద్దఎత్తున చేరుతాయి. వీటిని తినేందుకు పాములు ఇక్కడికి వచ్చి చేరుతాయి. అంతేకాకుండా ఈ చెట్టు గుబురుగా ఉండి పాములు నక్కేందుకు అనువుగా ఉంటాయి.