Smartphone Network: ఇంట్లోకి వెళ్లగానే మొబైల్ నెట్‌వర్క్ మాయం అవుతుందా..? ఈ ట్రిక్స్ పాటించండి

How to Speed Mobile Network: చాలా మంది ఇళ్లలో మొబైల్‌లో నెట్‌వర్క్‌ సమస్య ఉంటుంది. బయట నుంచి ఇంట్లోకి వెళ్లగానే సెల్‌లోని నెట్‌వర్క్ అలా మాయమైపోతుంటుంది. కాల్స్ మాట్లాడాలంటే.. మళ్లీ రావాల్సి ఉంటుంది. మీరు కూడా ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారా..? అయితే కొన్ని ట్రిక్స్ పాటించి మీ ఇంట్లోనే నెట్‌వర్క్ ఉపయోగించండి.
 

  • Aug 07, 2023, 21:56 PM IST
1 /5

మీ బెడ్‌రూమ్‌లో నెట్‌వర్క్ సమస్య ఉంటే.. హాల్‌లో కూర్చొని స్మార్ట్‌ఫోన్‌ను వినియోగించేందుకు ప్రయత్నించండి. కిటీకిలు, తలుపులు మూసి ఉన్నా నెట్‌వర్క్ సమస్యలు రావచ్చు. తెరిచి ఉంచి మొబైల్‌ను ఉపయోగించండి.   

2 /5

మీరు అపార్ట్‌మెంట్‌లో రెంట్‌కు ఉంటే.. మరీ ఎత్తైన ఫ్లాట్‌లో ఉండేలా చూసుకోండి. నెట్‌వర్క్ కవరేజ్ అటువంటి ప్రదేశంలో ఎక్కువగా ఉంటుంది. మీరు మూడు లేదా నాల్గో అంతస్తులో ఉంటే నెట్‌వర్క్ సమస్యలు ఎదురుకాకపోవచ్చు.  

3 /5

అయినా మీరు నెట్‌వర్క్ సమస్యను ఎదుర్కొంటూ ఉంటే.. మీ ఇంటి లోపల నెట్‌వర్క్ బూస్టర్ పరికరాన్ని ఉపయోగించాలి. ఇది  రూ.1500 నుంచి రూ.4000 వరకు మార్కెట్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ పరికరంతో ఇంట్లో నెట్‌వర్క్ సమస్యకు చెక్ పెట్టొచ్చు.   

4 /5

మీ ఇంటి కిటికీలలో గాజును ఉపయోగించాలి. తద్వారా మీ ఫోన్‌లో నెట్‌వర్క్ సమస్య ఉండదు.  

5 /5

మీ ఇంట్లో ఫాల్స్ సీలింగ్ ఉంటే.. మొబైల్ నెట్‌వర్క్‌పై ప్రభావం చూపిస్తుంది. ఇంట్లో ఉన్న సమయంలో సీలింగ్ ఉంటే.. ఫోన్‌కి కాల్స్, ఇంటర్నెట్‌ను ఉపయోగించేందుకు సమస్యలు ఎదురుకావచ్చు.