Skin Care Mistakes: మీ చర్మానికి హాని కల్గించే 5 తప్పులు ఇవే

Skin Care Mistakes: మనిషికి ఆరోగ్యంపై శ్రద్ధ ఎంత అవసరమో..చర్మ సంరక్షణ కూడా అంతే ముఖ్యం. నిత్య జీవితంలో లేదా జీవనశైలిలో చేసే చిన్న చిన్న పొరపాట్లు ముఖాన్ని నిర్జీవంగా మారుస్తుంటాయి.  చర్మం ఆరోగ్యంగా ఉంచాలంటే కొన్ని సూచనలు తప్పకుండా ఫాలో కావాలి.

Skin Care Mistakes: రోజూ చేసే పొరపాట్ల వల్లే ఈ పరిస్థితి ఎదురౌతుంటుంది. ఈ పొరపాట్ల కారణంగా చర్మం పాడయ్యే అవకాశముంటుంది. చర్మం నిగారింపు, రంగు తేలాలంటే ఎలాంటి తప్పుల్ని చేయకూడదో తెలుసుకుందాం..

1 /5

చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే అనారోగ్యకరమైన పదార్ధాలకు దూరంగా ఉండాలి. షుగర్, ప్రోసెస్డ్ ఆహారం తినడం వల్ల చర్మంపై పింపుల్స్ , యాక్నే వంటివి ఏర్పడుతాయి.

2 /5

చర్మానికి  ఎక్స్‌ఫోలియేట్ చాలా అవసరం. అయితే అతిగా ఉండకూడదు. ఎక్స్‌ఫోలియేట్ ఎక్కువైతే చర్మం దెబ్బతినే అవకాశముంటుంది. 

3 /5

తీవ్రమైన ఎండల్లో బయటకు వెళ్లేటప్పుడు మేకప్ చేసి బయటకు వెళ్తుంటారు. దుమ్ము ధూళి వల్ల చర్మం పూర్తకిగా దెబ్బతింటుంది. సన్‌స్క్రీన్ రాసి ఇంట్లోంచి బయటకు వెళ్తే..చర్మం పాడవకుండా ఉంటుంది.

4 /5

ప్రతిరోజూ తగినంత నిద్ర చాలా అవసరం. నిద్ర తగినంత లేకపోతే చర్మం రంగు క్రమంగా తగ్గుతుంది. రోజూ తగినంత నిద్ర 7-8 గంటలు లేకపోతే ముఖంపై గీతలు పడి అందం దెబ్బతింటుంది. 

5 /5

మేకప్ తొలగించకుండా నిద్రపోతే చర్మానికి హాని కలుగుతుంది. అందుకే రాత్రి వేళ మేకప్ తొలగించి నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. మేకప్‌తో నిద్రపోతే చర్మ రంధ్రాలు మూసుకుపోయే ప్రమాదముంది.  దాంతో చర్మానికి ఆక్సిజన్ ఆందదు.