Back Pain Remedies: నడుము నొప్పితో బాధపడుతున్నారా..?.. ఈ సింపుల్ చిట్కాలు మీకోసమే..

Back Disk Pain: మనలో చాలా మంది గంటల తరబడి కూర్చుని పనులు చేస్తుంటారు. దీంతో నడుము మీద విపరీమైన స్ట్రెయిన్ పడుతుంది.ముఖ్యంగా డిస్క్ ప్రాంతంలో ఉన్న ఎముక రాపిడికి గురౌతుంది. ఈ క్రమంలో నడుము నొప్పి అనేది వస్తుంది.

1 /6

కరోనా వచ్చినప్పటి నుంచి చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలీని కల్పించాయి. అప్పటి నుంచి అందరు ఇంట్లో నుంచి వర్క్ చేయడం ప్రారంభించారు. దీంతో శారీరక శ్రమపూర్తిగా తగ్గిపోయింది. నడవటం, యోగాలు,ఎక్సర్ సైజ్ లు చేసే తీరిక లేకుండా అయిపోయారు.

2 /6

గంటల తరబడి లాప్ టాప్ లముందు పనులు చేయడం ప్రారంభించారు. దీంతో చాలా మంది నడుము నొప్పి, వెన్నునొప్పి సమస్యలతో తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు. గంటల తరబడి ఒకే పోజిషన్ లో కూర్చుండటం వల్ల నడుము నొప్పి వస్తుంది.  

3 /6

వర్క్ చేసుకునే వాళ్లు గంటకు ఒకసారి తప్పకుండా లేచీ అటు ఇటు నడవాలి, కంప్యూటర్ నుంచి విరామం తీసుకొవాలి. ఒక పదినిముషాల పాటు ధ్యానం,యోగా చేయాలి. ఇలా చేస్తే రిఫ్రెష్ గా ఉంటుంది. అంతేకాకుండా.. తిన్నతర్వాత కాస్తంతా గ్యాప్ ఇవ్వాలి.  

4 /6

పనిచేస్తున్నప్పుడు టెబుల్ ను మీ తలకు సరైన పొజిషన్ లో ఉండేలా చూసుకొవాలి. లేకుంటే తలలోని నరాలు లాగేస్తాయి. ఎక్కువగా కిందకు వంగి సిస్టమ్ లో తలదూర్చేసి కూర్చోకూడదు. కొందరి కళ్లు డ్రై అయిపోతుంటాయి.  

5 /6

ఇలాంటి వారు కీరా దోసకాయ ముక్కలను రౌండ్ గా కట్ చేసి కళ్లమీద పెట్టుకొవాలి. అంతేకాకుండా.. ప్రతిరోజు మంచి ఫుడ్ ను తీసుకొవాలి. ఆఫీస్ టెబుల్ , బ్యాక్ సపోర్టు పిల్లో ఉండేలా చూసుకొవాలి. దీంతో నడుము మీద స్ట్రెస్ ఉండదు.

6 /6

నడుము నొప్పిగా అన్పించినప్పుడు ఒక అరగంటపాటు పడుకుంటే కాస్తంత ఉపశమనం లభిస్తుంది. బరువైన వస్తువులు ఎత్తే పనులు మాత్రం అస్సలు చేయకూడదు. మానసిక ఒత్తిడికి గురికాకుండా పనులు చేస్తు ఉండాలి. మధ్య మధ్యలో కాస్తంత విరామం తీసుకొవాలి.Disclaimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్నవి వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)