Mysterious Atlantis Discovered: బయటపడిన లక్షల ఏళ్ల క్రితం మునిగిన కాల్పనిక ద్వీపం

Mysterious Atlantis Discovered: ప్రఖ్యాత దార్శనికుడు ప్లేటో కల్పిత నగరం అట్లాంటిస్ గురించి వినే ఉండవచ్చు. ఇప్పుడా నగరం మిస్టరీ వీడింది. అది కాల్పనిక నగరం కానే కాదు. వాస్తవం కూడా. దాదాపు 4 శతాబ్దాల క్రితం ఊహించిన నగరం ఆనవాళ్లు ఇప్పుడు బయటపడ్డాయి. ఆ వివరాలు మీ కోసం.

Mysterious Atlantis Discovered: అట్లాంటిస్ అనేది ఓ కాల్పనిక ద్వీపం. దేవతలు ఈ ద్వీపాన్ని నీటిలో ముంచేశారు. ఈ ద్వీపం గురించి మొట్ట మొదటిసారి ప్లేటో తన పుస్తకాల్లో ప్రస్తావించాడు. అయితే పరిశోధకులకు ఇప్పుడు కైనరీ ద్వీపం సమీపంలో మునిగిపోయి ఉన్న ఓ ద్వీపం కన్పించింది. సముద్రంలో 2500 మీటర్ల లోతులో బయటపడింది.
 

1 /5

సముద్ర పరిశోధకులు ఏం చెప్పారంటే స్పెయిన్‌కు చెందిన భూ పరిశోథకుడు చెప్పినదాని ప్రకారం ఇది అట్లాంటిస్ కధకు అద్దం పట్టేలా ఉంది. వాస్తవానికి ఇది మునిగిన ఓ ద్వీపం. ఇంకా మునిగిపోతోంది. అచ్చం అట్లాంటిస్ కధలో ఉన్నట్టే

2 /5

లాన్స్ అట్లాంటిస్ మునిగిన ఈ భూభాగాన్ని పరిశోధకులు లాన్స్ అట్లాంటిస్‌గా పేరు పెట్టారు. ఇది ఇవాళ కూడా ప్రచారంలో ఉన్న అట్లాంటిస్ కల్పనకు అద్ధం పడుతుంది

3 /5

పరిశోధకుల అంచనా ఏంటి ఇదొక మునిగిన ప్రాంతం. ఈ ప్రాంతం ఆస్ట్రేలియాలోనిది. ఈ ప్రాంతం మునగడంతో ఇక్కడ నివసించిన ప్రజలు కొత్త ప్రదేశాన్ని ంచుకున్నారు. ఈ ప్రాంతంలో పెరుగుతున్న సముద్రమట్టం ద్వీపాల్ని ముంచేసింది. 

4 /5

బ్రిటన్ కంటే రెండింతలు పెద్దైన అట్లాంటిస్ మహా ద్వీపం బ్రిటన్ కంటే దాదాపుగా రెండింతలు పెద్దదిగా ఉన్న అట్లాంటిస్ మహాద్వీపం దొరికింది. పరిశోధకుల అంచనాల ప్రకారం ఈ మిస్టరీ ప్రదేశంలో దాదాపుగా 5 లక్షలమంది ఉండేవారు. మునిగిన ప్రాంతాల్లో ప్రాచీన నదుల గుర్తులు, తాజా నీటి సరస్సుల భాగాలు కన్పించాయి.

5 /5

పైలట్ రహిత సబ్‌‌మెరీన్  డైలీ స్టార్ పత్రికలో ప్రచురితమైన ఆర్టికల్ ప్రకారం హై క్వాలిటీ, హై రిజల్యూషన్ కలిగిన కెమేరా, రోబోటిక్ చేతులు కలిగిన పైలట్ రహిత సబ్‌మెరీన్ సముద్రంలో 2500 మీటర్ల లోతుకు పంపించారు. ద్వీపాల సముద్రతలం నుంచి శాంపిల్స్ సేకరించింది. లక్షల ఏళ్ల క్రితం మునిగిపోయి ఉండవచ్చని పరిశోధకుల అంచనా