Foods for Glowing Skin: సాధారణంగా వయస్సు పెరిగే కొద్దీ వృద్ధాప్య లక్షణాలు కన్పిస్తుంటాయి. 40 ఏళ్లు దాటిన తరువాత ఇది సహజం. చర్మం వదులుగా మారుతుంటుంది. ముడతలు పడుతుంటాయి. ముఖంపై చారలు కన్పిస్తాయి. అయితే సరైన డైట్, జీవనశైలి ఉంటే వయస్సు 40 దాటినా వృద్ధాప్యం దరిచేరదు. చర్మం నిగనిగలాడుతుంటుంది. అదెలాగో తెలుసుకుందాం.
ఫ్యాటీ ఫిష్ సాల్మన్, ట్యూనా వంటి చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి లోపల్నించి పోషకాలు అందేలా చేస్తాయి. చర్మం హైడ్రేట్‌గా ఉండేట్టు చేస్తుంది. ఫ్యాటీ యాసిడ్స్ చర్మాన్ని స్వెల్లింగ్ నుంచి రక్షిస్తాయి. నేచురల్ ఆయిల్ బ్యాలెన్స్ చేస్తుంది. ఫలితంగా చర్మం మృదువుగా నిగనిగలాడుతుంటుంది.
బ్లూ బెర్రీ బ్లూ బెర్రీస్‌లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పెద్దమొత్తంలో ఉంటాయి. ఇవి చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడుతాయి. కొలాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి. కొలాజెన్ అనేది చర్నం ఎలాస్టిసిటీని కాపాడుతుంది. దాంతో చర్మం ఎప్పటికీ వదులు కాకుండా ఉంటుంది. బ్లూబెర్రీస్ మీ డైట్‌లో భాగంగా చేసుకుంటే చర్మం నిగనిగలాడటం ఖాయం
బాదం బాదంలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. దాంతో చర్మాన్ని సూర్య కిరణాల నుంచి రక్షించుకోవచ్చు. విటమిన్ ఇ అనేది చర్మ కణాలను ఫ్రీ రాడికల్స్ నుంచి కాపుడుతుంది. చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. అయితే రోజూ క్రమం తప్పకుండా తీసుకోవాలి
పాలకూర పాలకూరలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కే, ఐరన్, ఫోలేట్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్నానికి కాంతినిస్తాయి. విటమిన్ ఎ అనేది చర్మ కణాల ఉత్పత్తిని పెంచుతుంది. విటమిన్ సి అనేది కొలాజెన్ తయారీకు తోడ్పడుతుంది.
టొమాటో టొమాటోలో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. చర్మాన్ని సూర్యుని నుంచి వెలువడే యూవీ కిరణాల నుంచి కాపాడుతుంది. ఏజియింగ్ ప్రక్రియను నెమ్మదించేలా చేస్తుంది. టొమాటో డైట్‌లో భాగంగా ఉంటే చర్మానికి అన్ని విధాలుగా మంచిది.