Sankranthi Easy Muggulu Rangoli Design 2025: సంక్రాంతి పండగ రోజున ముగ్గులు పెట్టుకోవడం ఒక ఆనవాయితీగా వస్తోంది. ప్రతి ఒక్కరూ సంక్రాంతి పండగ రోజు తప్పకుండా ఏదో ఒక ముగ్గును ఇంటి ముందు వేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఈరోజు ఇంటి ముందు ముగ్గును పెట్టడం వల్ల సాక్షాత్తు లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని ఒక ఆనవాయితీ.
Sankranthi Easy Muggulu 2025: సంక్రాంతి పండగ అంటేనే మనకు గుర్తొచ్చేవి ముగ్గులు.. మహిళలంతా ఉదయాన్నే ఐదు గంటలకు నిద్రలేచి ఇంటి ముందు ఉండే వాకిట్లో ముగ్గులు వేస్తారు. సంక్రాంతి పండగను ప్రతి ఏడాది జనవరి మాసంలో జరుపుకుంటారు. ఈ పండగను అన్ని పండుగలతో పోలిస్తే ఎక్కువ రోజులపాటు జరుపుకుంటూ ఉంటారు. ప్రతి సంవత్సరం తెలుగు ప్రజలు ఈ సంక్రాంతి పండగ మూడు నుంచి నాలుగు రోజుల పాటు జరుపుకుంటూ ఉంటారు. ముఖ్యంగా మహిళలైతే ఇంటిముందు అందమైన ముగ్గులు వేసి గొబ్బిళ్లు పెడతారు. ఈ ముగ్గులు సంక్రాంతి పండుగకు ఎంతో ఆకర్షణీయంగా నిలుస్తాయి. అయితే మీరు కూడా ఈ సంవత్సరం సంక్రాంతి పండగ సందర్భంగా కొత్త డిజైన్‌తో కలిగిన ముగ్గులు వేయాలనుకుంటున్నారా? ఇప్పుడే ఇలా వేసుకోండి.
జీవనశైలి మారేకొద్ది.. అనేక మార్పులు వస్తువు ఉంటాయి. ఇందులో భాగంగా సంక్రాంతి ముగ్గులకు సంబంధించిన డిజైన్స్‌లో కూడా వివిధ రకాల మార్పులు వచ్చాయి. మన పూర్వీకులు కేవలం ముగ్గులు అంటే వాకిలి నిండా గీతలు పెట్టేవారు. కానీ పోను పోను నేటి మహిళలు వివిధ కలర్స్ ను వినియోగించి ముగ్గులు వేస్తున్నారు.
ముఖ్యంగా పూర్వీకులు వేసే గీతల డిజైన్స్‌తో కూడిన ముగ్గుల్లో ఎక్కువగా సంక్రాంతి థీమ్స్ కు సంబంధించిన సింబల్స్ ఉండేవట. తెలుగు రాష్ట్రాల్లోనైతే ఎక్కువగా గంగిరెద్దులు, చెరుకు గడలు, పాలు పొంగుతున్న కుండలను వేసేవారట.
గతంలో మన పూర్వీకులు సంక్రాంతి పండగ రోజున తప్పకుండా చుక్కలతో కూడిన ముగ్గులను మాత్రమే వేసుకునేవారు. ఇవి ఇంటి ముందు అప్పుడు ఎంతో ఆకర్షణీయంగా నిలిచేవట. ఎక్కువగా ఐదు చుక్కల ముగ్గు వేసే వారిని సమాచారం.
ఇప్పుడు ప్రస్తుతం చాలామంది వివిధ కలర్స్ తో తులసి చెట్టు ముగ్గు కూడా వేస్తున్నారు. వివిధ కలర్స్ నింపి, ఎంతో అందంగా అలంకరిస్తున్నారు..
అంతేకాకుండా కొంతమంది నెమలి బొమ్మలతో కూడిన కొన్ని ప్రత్యేకమైన చుక్కల ముగ్గులు కూడా వేసేవారు. ఇందులో తెలుపు రంగు తో కూడిన సుద్దను ఫిల్ చేసేవారని పూర్వికులు తెలుపుతున్నారు.
అలాగే కొంతమంది సంక్రాంతి పండగ రోజున గాలిపటాల ముగ్గులు కూడా వేసేవారట. ఇలా గాలిపటాల ముగ్గులు వేయడం తరతరాల సాంప్రదాయంగా వస్తోంది. పూర్వీకుల నుంచి ఇప్పటివరకు గాలిపటాల ముగ్గులు వేస్తూనే ఉన్నారు.
మన పూర్వీకులు ఇంటి ముందు ఉన్న చిన్న వాకిల్లోనైనా తప్పకుండా సంక్రాంతి పండుగ రోజున ముగ్గులు పెట్టే వారట. అంతే కాదండోయ్ అందులో తప్పకుండా రథంతో కూడిన ముగ్గును వేసేవారట. అప్పుడు చుక్కలతో కూడిన రథం ముగ్గులకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉండేది.
ప్రతి సంవత్సరం ఎప్పటిలాగే సంక్రాంతి పండగ రోజున తప్పకుండా మీ ఇంటి వాకిలి ముందు ముగ్గులు పెట్టుకోండి. ఇలా ఉదయాన్నే ముగ్గులు పెట్టుకోవడం వల్ల సాక్షాత్తు లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని పురాణాల్లో పేర్కొన్నారు.