Samsung Galaxy A55 5G Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో Galaxy A55 5G స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌.. ఎగబడి కొంటున్న జనాలు!

Samsung Galaxy A55 5G Price Cut: ఫ్లిఫ్‌కార్ట్‌లో ప్రీమియం ఫీచర్స్‌ కలిగిన Samsung Galaxy A55 5G స్మార్ట్‌ఫోన్‌ అతి తక్కువ ధరలో లభిస్తోంది. ఈ మొబైల్‌పై అదనంగా ఫ్లాట్‌ డిస్కౌంట్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. అలాగే ఇతర ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకోండి.

 

Samsung Galaxy A55 5G Price Cut: ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్‌లో ప్రత్యేకమైన డీల్స్‌ ప్రారంభమయ్యాయి. ఈ డీల్స్‌లో భాగంగా కొన్ని స్మార్ట్‌ఫోన్స్‌ డెడ్‌ ఛీప్‌ ధరల్లో లభిస్తున్నాయి. అంతేకాకుండా అదనంగా ఫ్లాట్‌ డిస్కౌంట్‌ ఆఫర్స్‌తో పాటు బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఏయే మొబైల్స్‌ ఈ డీల్స్‌ ప్రత్యేకమైన ఆఫర్స్‌లో లభిస్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. 

1 /6

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ సాంసంగ్‌కి సంబంధించిన కొన్ని మొబైల్స్‌ అతి తక్కువ ధరల్లో లభిస్తున్నాయి. ఫ్లిఫ్‌కార్ట్‌లో స్పెషల్ డీల్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి సాంసంగ్‌ గెలాక్సీ A, F సిరీస్‌లకు సంబంధించి మొబైల్స్‌ అతి తక్కువ ధరల్లో లభిస్తున్నాయి.

2 /6

ఈ సాంసంగ్‌ మొబైల్స్‌ను బ్యాంక్‌ ఆఫర్స్‌లో భాగంగా కొనుగోలు చేస్తే భారీ తగ్గింపు పొందవచ్చు. అలాగే EMI ఆప్షన్‌లో కొనుగోలు చేస్తే ఆకర్శనీయమైన డిస్కౌంట్‌ కూడా లభిస్తుంది. దీంతో పాటు ఎక్చేంజ్‌ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.   

3 /6

ఫ్లిఫ్‌కార్ట్‌లో ఈ Samsung Galaxy A55 5G స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేస్తే డెడ్ చీప్‌ ధరలో లభిస్తుంది. ప్రస్తుతం 8GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌ కలిగిన మొబైల్‌  ధర రూ. 42,999తో ప్రత్యేక డిస్కౌంట్‌లో లభిస్తోంది.

4 /6

ఈ  Samsung Galaxy A55 5G స్మార్ట్‌ఫోన్‌ను బ్యాంక్‌ ఆఫర్స్‌లో భాగంగా కొనుగోలు చేయాలనుకునేవారు HDFC బ్యాంక్ కార్డ్‌తో బిల్‌ చెల్లిస్తే దాదాపు రూ. 3,000 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ మొబైల్‌ను రూ.38,500కే పొందవచ్చు.   

5 /6

ఈ స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్‌ వివరాల్లోకి వెళితే ఇది 6.6 అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లేతో లభిస్తోంది. అంతేకాకుండా అద్భుతమైన Exynos 1480 చిప్‌సెట్‌పై పని చేస్తుంది. అలాగే ఇది అద్భుతమైన డిజైన్‌తో అందుబాటులోకి వచ్చింది.   

6 /6

ఇక ఈ మొబైల్‌ బ్యాక్‌ సెటప్‌ వివరాల్లోకి వెళితే, ఇది ట్రిపుల్ కెమెరా సెటప్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇందులో  50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉంటుంది. అలాగే 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా సెపట్‌లో లభిస్తోంది.