Samantha: ప్రియుడి వల్ల తమిళ సినిమాలు వదులుకుంటున్న సమంత.. ? ఏం చెప్పిందంటే..!

Samantha Movies: ప్రముఖ స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న సమంత గత కొద్ది రోజులుగా తమిళ్ ఇండస్ట్రీలో అవకాశాలను వదులుకుంటున్న విషయం తెలిసిందే. అయితే దీనంతటికీ కారణం ఆమె రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ అంటూ ఒక వార్త వెలుగులోకి వచ్చింది. 
 

1 /5

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకుంది సమంత. టాలీవుడ్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించిన ఈమె, అనతి కాలంలోనే భారీ పాపులారిటీ అందుకుంది. 

2 /5

ముఖ్యంగా మహేష్ బాబు సినిమాతో లైమ్ లైట్ లోకి వచ్చిన సమంత, ఆ తర్వాత వరుస సినిమాలు చేసి భారీ పాపులారిటీ అందుకుంది. ముఖ్యంగా తెలుగు, తమిళ్ మాత్రమే కాకుండా హిందీ వెబ్ సిరీస్లలో కూడా నటించి భారీ పాపులారిటీ అందుకుంది. 

3 /5

ఇకపోతే నాగచైతన్య నుండి విడిపోయిన తర్వాత ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న సమంత,  ఇటీవలే వాటి నుంచి కోలుకునే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే మళ్ళీ మయోసైటిస్ వ్యాధి బారినపడి దాదాపు ఏడాది పాటు ఇండస్ట్రీకి దూరమైంది సమంత. ఇప్పుడు మళ్లీ ఇండస్ట్రీలోకి వచ్చే ప్రయత్నం చేస్తుండగా మరొకవైపు స్కిన్ ఎలర్జీ సమస్యలతో బాధపడుతోందట. కొన్ని ఆహార పదార్థాలు పడడం లేదని, ఇటీవల వైద్యులను సంప్రదించినట్లు సమాచారం. 

4 /5

ఇకపోతే ఇదంతా ఇలా ఉండగా ఈమె తమిళ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదని ఒక వార్త తెరపైకి వచ్చింది. దీనికి కారణం తన రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ డైరెక్టర్ రాజ్ అని సమాచారం. సమంత ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ సిటాడెల్ వెబ్ సిరీస్ లను డైరెక్టర్ రాజ్ దర్శకత్వంలో చేసిన విషయం తెలిసిందే. ఇతడికి ఇప్పటికే వివాహం జరిగింది. అయితే ఇతడితో ఈమె ఎఫైర్ పెట్టుకుందని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.   

5 /5

ఇక ఇప్పుడు రక్త్ బ్రహ్మాండ్ కోసం మళ్లీ రాజ్ అండ్ డీకే తో కలిసి పని చేస్తోంది. ఇక ఈ క్రమంలోనే తమిళ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడం పై మాట్లాడుతూ.. ఇతరులను నిరుత్సాహపరచకుండా చూసుకోవడమే లక్ష్యంగా సినిమా ఎంపికలు చేసుకుంటున్నాను అంటూ తెలిపింది. మొత్తానికైతే తన బాయ్ ఫ్రెండ్ కోసమే ఇలాంటి పని చేస్తుందని నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు.