Samantha Controversy: సమంత గురించి తెలుగు ప్రేక్షకులకు.. ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. మొదటి సినిమా ఏం మాయ చేసావేతోనే.. నిజంగానే మాయ చేసింది. ఈ హీరోయిన్ అప్పటి నుంచి.. వరుసగా సినిమాలు చేస్తూ.. తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వచ్చింది. తాజాగా సమంత.. చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరిని షాక్ కి గురి చేస్తున్నాయి..
చిన్న చిన్న అడ్వటైజ్మెంట్స్..ద్వారా సినిమా రంగంలోకి అడుగుపెట్టిన హీరోయిన్ సమంత. ఏం మాయ చేసావే సినిమా ద్వారా.. తెలుగు ప్రేక్షకులకు సైతం పరిచయం అయింది. మొదటి సినిమాతోనే మాయ చేసింది ఈ హీరోయిన్. గౌతమ్ వాసుదేవ్ మీనన్.. దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో నాగచైతన్య హీరోగా నటించారు.
ఈ సినిమాతో.. ఆకట్టుకున్న వీరిద్దరి జంట.. ఆ తరువాత కొద్ది కాలంకి పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే అనుకోని.. కారణాలవల్ల వీరిద్దరూ విరాకులు తీసుకున్నారు. వీరిద్దరూ విడిపోవడం.. ఇప్పటికీ కూడా అభిమానులు తీసుకోలేక.. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వీరిద్దరికీ సంబంధించిన.. గత ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు.
అంతేకాకుండా ఆరోగ్యపరంగా కూడా ఈ మధ్య సమంత.. కొన్ని సమస్యలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. అయినా కానీ సమంత వెనకడుగు వేయకుండా.. ప్రస్తుతం మళ్ళీ పుంజుకొని.. వరుస సినిమాలు చేస్తూ అలరిస్తోంది. త్వరలోనే సమంత మా ఇంటి బంగారం.. అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ముందుకి రానుంది.
ఈ సినిమాని సమంత సొంత నిర్మాణ సంస్థలో నిర్మించడం.. మరో విశేషం. ఇక ఈ విషయాలన్నీ పక్కన పెడితే అసలు.. సినిమాల్లోక రావడానికి.. గల కారణం ఒక ఇంటర్వ్యూలో చెప్పి అందరిని షాక్ కి గురి చేసింది సమంత. తన తండ్రి తన అప్పు తీర్చక పోవడం వల్లే.. తాను సినిమాల్లోకి రావాల్సి వచ్చింది అంటూ చెప్పుకొచ్చింది ఈ హీరోయిన్..
అసలు విషయానికి వస్తే సమంత చదువుకునేటప్పుడు తన తండ్రి తన ఎడ్యుకేషన్ లోన్స్ ను.. కట్టను అని చెప్పాడంట. వారికి డబ్బులపరంగా ఎన్నో సమస్యలు ఉండడం వల్ల.. సమంతని ఇక చదివించలేను అని.. తన చదువుకి గల అప్పుని తాను తీర్చలేను అని.. చెప్పడంతో.. సమంత ఇంకా ఏ దారి లేక సినిమాల్లోకి రావాల్సి వచ్చిందంట. ఇక ఈ విషయాన్ని చెబుతూ.. సమంత వాళ్ళ నాన్న అలా చెప్పడం వల్లే.. తాను ఇప్పుడు ఇలా ఉన్నాను అని.. అందుకే ఆరోజు జరిగిన సంఘటనను తను ఇప్పటికీ మరచిపోలేను.. అని చెప్పుకొచ్చింది.