Rs 2k Above UPI Payments Charges Is Applicable Fact Here: కరోనా తర్వాత నగదు అనేది మనుషుల జేబుల్లో కనిపించడం లేదు. ప్రతి చిన్న చెల్లింపులకు డిజిటల్ పేమంట్లు చేస్తుండడంతో యూపీఐ పేమెంట్లు ఊహించని స్థాయిలో పెరిగాయి. ఈ నేపథ్యంలో యూపీఐ పేమెంట్లకు ఛార్జీలు ఉంటాయనే వార్త కలకలం రేపింది. ఈ వార్తపై కేంద్ర ప్రభుత్వం ఒక స్పష్టత ఇచ్చింది.
డిజిటల్ పేమెంట్: ప్రతి ఒక్కరి జేబులో నగదు అనేది మాయమై డిజిటల్ పేమెంట్ వచ్చేసింది. స్మార్ట్‌ఫోన్‌తో పేమెంట్లు చేయడం అలవాటుగా మారింది.
ప్రతి చెల్లింపు: ప్రతి ఒక్కరూ డిజిటల్ పేమెంట్లు యూపీఐ ద్వారా చేసేస్తున్నారు. అగ్గిపెట్టె కొన్నా కూడా యూపీఐతో చెల్లిస్తున్నారు.
పుకార్లు: యూపీఐ లావాదేవీలకు ఛార్జీలు విధిస్తారనే వార్త ప్రజలను కలవర పరుస్తోంది. విస్తృతంగా ఈ ప్రచారం జరుగుతోంది.
చార్జీలు: రూ.2 వేలకు పైగా లావాదేవీ చేస్తే 1.1% ఛార్జీలు కట్టాల్సి ఉంటుందని వార్త చక్కర్లు కొడుతోంది.
అవాస్తవం: యూపీఐ చార్జీలపై పలు టీవీ ఛానళ్లు, వెబ్‌సైట్లు ప్రచారం చేస్తున్నాయని.. ఇది పూర్తిగా అవాస్తవమని పీఐబీ ప్రకటించింది.
పీపీఐపైనే చార్జీలు: సాధారణ యూపీఐ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు ఉండవని స్పష్టం చేసింది. డిజిటల్ వ్యాలెట్లు అయిన ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రూమెంట్ల (పీపీఐ) పైనే ఛార్జీలు ఉంటాయని పీఐబీ వెల్లడించింది.
వాస్తవం ఇదే: ఈ వాస్తవం గ్రహించి యూపీఐ పేమెంట్లపై ఎలాంటి కంగారు వద్దని పీఐబీ తెలిపింది. వాస్తవం తెలుసుకోవాలని సూచించింది.