RRB ALP Answer Key 2024:రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అసిస్టెంట్ లోకో పైలట్ (RRB ALP) జవాబు పత్రం రిలీజ్ చేసింది. రాత పరీక్షకు హాజరైన అభ్యర్థులు వెంటనే www.rrb.gov.in ద్వారా చెక్ చేసుకోండి... ఈ పరీక్షను నవంబర్ 25 ,29న గత నెలలో నిర్వహించారు. దీనికి సంబంధించిన జవాబు పత్రాన్ని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నేడు విడుదల చేసింది.
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అసిస్టెంట్ లోకో పైలట్ కు సంబంధించిన జవాబు పత్రం పిడిఎఫ్ ఫార్మాట్లో అందుబాటులో ఉంది. ఆర్ఆర్బీ అధికారి వెబ్సైట్లో నుంచి నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ రిజిస్ట్రేషన్ నంబరు, పుట్టిన తేదీతో ఈ జవాబు పత్రాన్ని విడుదల చేసుకునే సదుపాయాన్ని కల్పించారు.
గత నెలలో ఆర్ఆర్బీ అసిస్టెంట్ లోకో పైలట్ రాత పరీక్ష మూడు షిఫ్టుల్లో నిర్వహించారు. ఈ పరీక్ష ద్వారా అసిస్టెంట్ లోకో పైలట్ 18,799 పోస్టులను భర్తీ చేయనుంది.ఇది దేశవ్యాప్తంగా ఉన్న అన్ని అభ్యర్థులకు అవకాశాన్ని కల్పిస్తుంది.
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అసిస్టెంట్ లోకో పైలట్ జవాబు పత్రం డౌన్లోడ్ చేసుకునే విధానం... ముందుగా అధికార వెబ్సైట్ అయిన రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ rrb.gov.in ఓపెన్ చేయాల్సి ఉంటుంది.
ఆ తర్వాత హోమ్ పేజీలోని 'ఆర్ఆర్బీ ఏఎల్పి ఆన్సర్ కి 2004' పై క్లిక్ చేయాలి.అక్కడ మీరు మీ రిజిస్ట్రేషన్ నెంబర్ పుట్టిన తేదీ ఆధారంగా లాగిన్ అవ్వాలి.ఆ తర్వాత జవాబు పత్రాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. భవిష్య అవసరాల నిమిత్తం మీ దగ్గర భద్రంగా పెట్టుకోవాలి.
ఇక జవాబు పత్రంపై అభ్యర్థులకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే తగిన ప్రూఫ్ తో మీరు నామినల్ ఫీజు చెల్లించి మీ అభ్యంతరాలను వెల్లడించవచ్చు. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్సైట్ను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ ఉండాలి.