Chicken Handi: రెస్టారెంట్ స్టైల్‌లో చికెన్ హండి.. ఇలా చేస్తే రుచిగా ఉంటుంది..!

Chicken Handi Recipe: చికెన్‌తో వెరైటీ వంటకాలు చేసుకోవచ్చు. అయితే, ఎప్పుడైనా రెస్టారెంట్‌ స్టైల్‌లో చికెన్‌ హండి రిసిపీ తయారు చేసుకున్నారా? ఇది చూడటానికే కాదు, తినడానికి కూడా రుచి అదిరిపోతుంది. మనం ఏ రెస్టారెంట్‌ లేదా హోటల్‌కు వెళ్లినా చికెన్‌ రిసిపీలు ఆర్డర్‌ పెడతాం. అవి ఎంతగానో టేస్టీగా ఉంటాయి. కానీ, నాణ్యత విషయం అయి ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిందే. అయితే, ఇంట్లోనే రెస్టారెంట్‌ స్టైల్‌ చికెన్‌ హండి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
 

1 /5

చికెన్‌- కేజీ, టమోటా-పావు కేజీ, ఉల్లిపాయలు-3, కరివేపాకు, నూనె, నెయ్యి, ఉప్పు- రుచికి సరిపడా, కసూరీ మేతీ-ఒక స్పూన్‌, ధనియాలు, కారం- 2 టీస్పూన్‌, పసుపు-1 టీస్పూన్‌, జిలకర్ర పొడి- ఒక్కో స్పూన్‌, పెరుగు- మూడు టేబుల్‌ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్టు-2 టేబుల్‌ స్పూన్  

2 /5

ముందకు చికెన్‌ బాగా శుభ్రం చేయాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు, టమోటాలు సన్నగా కట్‌ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఓ కడాయి తీసుకుని అందులో నూనె, నెయ్యి వేసి వేడి చెయ్యాలి. ఉల్లిపాయలు వేసి దోరగా వేయించాలి. ఆ తర్వాత కరివేపాకు వేసి  అల్లం వెల్లుల్లి పేస్ట్‌, కారం, పసుపు, కశ్మీరీ చిల్లీ పౌడర్‌ కూడా వేస్తే రంగు బాగా కనిపిస్తుంది.  

3 /5

ఆ తర్వాత మాములు కారం, టమోటా ముక్కలు, ఉప్పు కూడా వేసి బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు టమోటాలు పూర్తిగా ఉడికిపోయిన తర్వాత చికెన్‌ ముక్కలు వేసి మరోసారి నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలి.  

4 /5

ఇప్పుడు మూత తీసి పెరుగు మీకు కావాలంటే నీళ్లు కూడా ఎక్కువ పోసుకోవచ్చు. మూత పెట్టి చికెన్‌ ఉడికేవరకు మగ్గించాలి. ఆ తర్వాత మూత తీసి కసూరీ మేతి, క్రీమ్‌, ధనియాలు, జిలకర్ర పొడి పై నుంచి వేసుకోవాలి. అంతే రుచికరమైన హండీ చికెన్‌ రెడీ.  

5 /5

దీన్ని అన్నం లేదా చపాతీల్లోకి తింటే రుచి అదిరిపోతుంది. ఇక్కడ మీరు కడాయి చికెన్‌ తయారు చేస్తున్నారు కాబట్టి గరం మసాలా కూడా వేసుకోవచ్చు. లేదా మసాలా వద్దు అనుకుంటే అలానే తినేయొచ్చు కూడా.