Jio vs Vodafone, idea, Airtel: ఇంటర్నెట్ స్పీడ్‌లో ఏది ఎక్కువ ? ఏది తక్కువ తెలుసా ?

రిలయన్స్ జియో వచ్చాకా టెలికాం రంగంలో అప్పటివరకు ఓ వెలుగు వెలిగిన టెలికాం నెట్‌వర్క్ కంపెనీలకు గడ్డుకాలం ఎదురైనంత పనైంది. అందుకు కారణం మిగతా టెలికాం ఆపరేటర్స్ కంటే తక్కువ టారిఫ్‌లు, రీచార్జులతో ఎక్కువ సేవలు అందించడమే.

  • Dec 17, 2020, 00:24 AM IST

రిలయన్స్ జియో వచ్చాకా టెలికాం రంగంలో అప్పటివరకు ఓ వెలుగు వెలిగిన టెలికాం నెట్‌వర్క్ కంపెనీలకు గడ్డుకాలం ఎదురైనంత పనైంది. అందుకు కారణం మిగతా టెలికాం ఆపరేటర్స్ కంటే తక్కువ టారిఫ్‌లు, రీచార్జులతో ఎక్కువ సేవలు అందించడమే. మరి ఈ ఇంటర్నెట్ సేవలు అందించడంలో ఏ ఆపరేటర్ ముందున్నాడో తెలుసుకునే ప్రయత్నం చేసింది టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ( TRAI ).

1 /8

ఇంటర్నెట్ డౌన్‌లోడ్ స్పీడ్‌లో రిలయన్స్ జియో కింగ్ అని ట్రాయ్ ( TRAI ) నిగ్గు తేల్చింది. అలాగే అప్ లోడింగ్ స్పీడ్‌లో వొడాఫోన్ టాప్ అని తేలింది. నవంబర్ నెలకుగాను ట్రాయ్ వెల్లడించిన గణాంకాల నివేదికలో ఈ విషయం స్పష్టమైంది.

2 /8

నవంబర్‌లో 20.8 ఎంబీపీఎస్ స్పీడ్‌తో రిలయన్స్ జియో ఇంటర్నెట్ డౌన్ లోడింగ్ స్పీడ్ బాగా పనిచేసింది. అలాగే వొడాఫోన్ విషయానికొస్తే.. నవంబర్ నెలలో 6.5 ఎంబీపీఎస్ స్పీడుతో అప్ లోడింగ్ కేటగిరీలో తొలి స్థానంలో నిలిచింది. ( Image credits : Reuters )

3 /8

డౌన్‌లోడింగ్ స్పీడులో తన ప్రత్యర్థి అయిన వొడాఫోన్‌తో పోల్చుకుంటే రెండు రెట్లు కంటే అధిక స్పీడుతో రిలయన్స్ జియో ( Reliance Jio ) దూసుకుపోయింది. వాస్తవానికి ఐడియా సెల్యూలార్, వొడాఫోన్ సంస్థలు ఒక్కటిగా మారి వొడాఫోన్ ఐడియాగా అవతరించినప్పటికీ.. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా మాత్రం డేటా స్పీడ్‌ లెక్కింపు విషయంలో రెండింటినీ వేరువేరుగానే పరిగణిస్తోంది.  ( Image credits : Reuters )

4 /8

నవంబర్‌లో వొడాఫోన్ ఇంటర్నెట్ డౌన్‌లోడింగ్ స్పీడ్ 9.8 mbps గా నమోదు కాగా ఆ తర్వాత స్థానాల్లో 8.8 ఎంబీపీఎస్‌ స్పీడుతో ఐడియా, 8 ఎంబీపీఎస్ స్పీడ్‌తో భారతి ఎయిర్‌టెల్ ( Airtel internet speed ) నిలిచాయి.

5 /8

అప్ లోడింగ్ స్పీడులో 6.5 ఎంబీపీఎస్‌తో వొడాఫోన్‌లో ( Vodafone uploading speed ) టాప్‌లో నిలవగా ఆ తర్వాత 5.8 ఎంబీపీఎస్ స్పీడుతో ఐడియా, 4 ఎంబీపీఎస్ స్పీడుతో ఎయిర్‌టెల్ ఉన్నాయి. డౌన్ లోడింగ్ స్పీడులో టాప్‌లో నిలిచిన రిలయన్స్ జియో.. అప్ లోడింగ్ స్పీడులో ( Jio internet speed ) మాత్రం 3.7 ఎంబీపీఎస్‌తో వొడాఫోన్, ఐడియా ( Idea internet speed ), ఎయిర్‌టెల్ లాంటి కాంపిటీటర్స్ కంటే ఎంతో వెనుకబడింది.

6 /8

డౌన్ లోడింగ్ స్పీడ్ అంటే.. ఇంటర్నెట్‌లో ఏదైనా శోధించేటప్పుడు ఉండే వేగాన్ని డౌన్ లోడింగ్ స్పీడ్ అంటారు.

7 /8

అలాగే అప్ లోడింగ్ స్పీడ్ అంటే.. మీ సిస్టం నుంచి కానీ లేదా ఇంటర్నెట్ నుంచి కానీ ఏదైనా డేటాను ఇతరులతో పంచుకునే సమయంలో ఉండే ఇంటర్నెట్ వేగాన్నే అప్ లోడింగ్ స్పీడ్ అంటారు.

8 /8

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI ) మై స్పీడ్ అప్లికేషన్ అనే యాప్ ( My speed application ) ద్వారా దేశవ్యాప్తంగా రియల్ టైమ్ పద్ధతిలో ఇంటర్నెట్ డౌన్‌లోడింగ్, అప్‌లోడింగ్ స్పీడుని లెక్కిస్తుంది. Also read : 7th Pay Commission: గుడ్ న్యూస్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు పెరగనున్న జీతాలు Also read : How to apply for MUDRA loan: ముద్ర లోన్‌కి ఎవరు అర్హులు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి ? Also read : Christmas Star: ఆకాశంలో అరుదైన క్రిస్మస్ స్టార్.. ఇప్పుడు తప్పితే మళ్లీ ఎప్పుడో