5 Foods To Lower Cholesterol: తీవ్ర కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారు తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే శరీరంలో కొలెస్ట్రాల్ మరింత పేరుకుపోయి.. ప్రాణాంతక సమస్యలు కూడా రావచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Reduce Body Cholesterol Level: శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోవడం కారణంగా చాలా మంది బరువు కూడా పెరుగుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా శరీరంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ప్రాణాంతకంగానూ మరే అవకాశాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే చాలా మంది వ్యాయామాలు చేయకుండా కూడా కొలెస్ట్రాల్‌ను తగ్గించుకుంటున్నారు. అయితే ఎలాంటి చిట్కాలు అనుసరించడం వల్ల చెడు కొలెస్ట్రాల్ నుంచి విముక్తి లభిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు పండ్లు కూడా కీలక పాత్ర పోషిస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు తీవ్ర ఊబకాయం సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తాయి.
ఓట్స్‌లో అధిక పరిమాణంలో కరిగే ఫైబర్ లభిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలనుకునేవారు ప్రతి రోజు ఓట్ మీల్ తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా శరీర బరువు కూడా సులభంగా తగ్గుతారు.
శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను సులభంగా తగ్గించేందుకు డ్రైఫ్రూట్స్ కూడా కీలక పాత్ర పోషిస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. చెడు కొలెస్ట్రాల్ కారణంగా గుండె సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ప్రతి రోజు డ్రై ఫ్రూట్స్‌ను తీసుకోవాలి.
వెల్లుల్లి ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌ను నియంత్రించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. తరచుగా గుండె సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు వెల్లుల్లిని పచ్చిగా నమిలి తినడం వల్ల అన్ని రకాల వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
గ్రీన్ టీ తాగడం వల్ల కూడా శరీరంలోని పేరుకుపోయిన కొలెస్ట్రాల్ నుంచి ఉపశమనం కలుగుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు గుండెపోటు రాకుండా కూడా రక్షిస్తాయట.