Rasi Phalalu 2025: 2025 సంవత్సరంలో ఈ రాశి వారికి అచ్చు గుద్దినట్టు ఇదే జరుగుతుంది.. స్త్రీ, పురుషులకు అద్భుతమైన ధనయోగం!

Vrushaba Rasi 2025 To 2026 Full Prediction In Telugu: ద్వాదశ రాశుల్లో రెండవ రాశి అయిన వృషభ రాశి (Vrushaba Rasi)వారి 2025 సంవత్సరం జాతకం పరిశీలిస్తే.. గత సంవత్సరం కంటే 2025 సంవత్సరం చాలా అద్భుతంగా ఉండబోతుందని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు. గ్రహ స్థితులు ఈ రాశి వారికి చాలా అనుకూలించడం వల్ల వీరు ఈ సమయంలో ఎలాంటి పనులు చేసిన ఊహించని విజయాలు సాధించగలుగుతారు. అలాగే వీరికి పట్టిందల్లా బంగారమే అవుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా మే తొమ్మిదో తేదీ నుంచి గురువు సంచారం ప్రభావం వల్ల వీరికి విశేషమైన లాభాలు కలుగుతాయి. 
 

1 /5

ఈ రాశి వారికి మే 9వ తేదీ నుంచి సెప్టెంబర్ 27వ తేదీ వరకు చాలా అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఉన్నవారికి విశేషమైన లాభాలు కలిగే అవకాశాలున్నాయి. అలాగే ఎడ్యుకేషన్ రంగంలో, బిజినెస్ చేసేవారికి, తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు ట్రావెలింగ్ నడిపే వారికి, రోడ్ సైడ్ కుకింగ్ బిజినెస్ చేసే వారికి కూడా ఈ సమయం చాలా వరకు అనుకూలించబోతోంది. వీరు ఈ సమయంలో వ్యాపారాలు విస్తరించడమే కాకుండా అధిక మొత్తంలో డబ్బులు పొందగలుగుతారు. అలాగే మే 9 నుంచి సెప్టెంబర్ 27 మధ్యకాలం వరకు మేషరాశి వారు కొత్త వ్యాపారాలు పెట్టడమే కాకుండా వారికి ఉన్న వ్యాపారాలు కూడా విస్తరించే ఛాన్స్ ఉంది. గ్రహాలు అనుకూలించడం వల్ల ఈ రాశి వారు ఎలాంటి పనులు చేసిన డబ్బు ఊరికేనే తిరిగి వస్తుంది.

2 /5

మే 9వ తేదీ నుంచి సెప్టెంబర్ నెల వరకు అన్ని రంగాల్లో ఊహించని ధన లాభాలను పొందగలుగుతారు. అలాగే ఏప్రిల్ 16 నుంచి శని ప్రభావం వల్ల వీరికి ఊహించని లాభాలు కలిగే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత అక్టోబర్ 10 నుంచి నవంబర్ 26వ తేదీ వరకు శని వక్రీకరించడం చేత యోగదాయకమైన పరిస్థితులు ఏర్పడతాయి. దీనివల్ల ఈ రాశి వారు ఎన్నో రకాల లాభాలు పొందగలుగుతారు. ఆ తర్వాత ఈ రాశి వారికి గురువు అనుగ్రహం వల్ల కోర్టు సంబంధిత సమస్యలు కూడా పరిష్కారం అవ్వబోతున్నాయి. అంతేకాకుండా కోర్టులో ఏదైనా కేసు ఉన్న వారికి ఈ సమయంలో వీరి వైపే విజయవకాశాలు లభిస్తాయి. 

3 /5

ఇక ఏప్రిల్ 16వ తేదీ నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు స్టీల్ రంగాల్లో పనులు చేస్తున్న వారికి అద్భుతంగా ఉండబోతోంది. అలాగే పెట్రోలియం బిజినెస్ లో బిజీగా ఉండే వారికి ఈ సమయం చాలా ఆర్థిక లాభాలను తెచ్చి పెట్టబోతోంది. అంతేకాకుండా పెట్రోలియం బిజినెస్తోపాటు ఎలక్ట్రిక్ పరిశ్రమల్లో పని చేస్తున్న వారికి విశేషమైన లాభాలు కలుగుతాయి. ఇక ఎలక్ట్రిక్ పరిశ్రమలు ఉన్నవారు ఈ సమయంలో వారి వ్యాపారాలు కూడా విస్తరించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి 2025 సంవత్సరం బిజీబిజీగా ఉంటుంది.   

4 /5

వృషభ రాశిలో జన్మించిన రాజకీయ నాయకులకు ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి ఈ సమయంలో నామినేటెడ్ పోస్టులు లభించడమే కాకుండా.. ఏవైనా ఎన్నికల్లో పోటీ చేయడం వల్ల అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు. అంతేకాకుండా ఉద్యోగ ప్రాప్తి కూడా కలుగుతుంది. నిరుద్యోగులు ఈ సమయంలో కచ్చితంగా భారీ ప్యాకేజీలతో కూడిన జాబులు పొందుతారు. అలాగే పెళ్ళికాని అబ్బాయిలకు ఈ సమయంలో మంచి భాగస్వామి లభించే ఛాన్స్ ఉంది. 

5 /5

ఇక మే నుంచి సెప్టెంబర్ నెల మధ్యకాలంలో వివాహ ప్రయత్నాలు ఏవైనా ఉంటే కాస్త డిలే అవుతాయి ఆ తర్వాత నవంబర్ 11వ తేదీ నుంచి సవ్యంగా సాగుతాయి. ఇక నవంబర్ నెల వివాహమైన దంపతులకు చాలా అద్భుతంగా ఉంటుంది. భాగస్వామ్య జీవితాల్లో విభేదాలు ఉన్న వారికి ఈ సమయంలో కాస్త శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా కుటుంబంలో విభేదాలు ఉన్న వారికి కూడా ఈ సమయంలో పరిష్కారం అవుతాయి. 2025 సంవత్సరం వృషభ రాశిలో జన్మించిన స్త్రీ పురుషులకు చాలా లావుదాయకంగా ఉంటుంది. ఈ సమయంలో వీరు ఎలాంటి పనులు చేసిన అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు.