Mercury in Capricorn and Aquarius Effect: శని పాలించే మకర, కుంభరాశుల్లోకి బుధుడు ప్రవేశించడం వల్ల కొన్ని రాశుల వారికి అఖండ ధనయోగం ఏర్పడుతుంది. దీనివల్ల వీరు ఈ సమయంలో విపరీతమైన లాభాలు పొందడమే కాకుండా వ్యక్తిగత జీవితంలో ఆనందాన్ని కూడా పొందుతారు. అలాగే ఆరోగ్యపరంగా వస్తున్న సమస్యలు కూడా దూరమవుతాయి.
Mercury in Capricorn and Aquarius Effect On Zodiac Signs: బుధ గ్రహాన్ని అన్ని గ్రహాలకు రాకుమారుడిగా భావిస్తారు. అందుకే ఈ గ్రహం ప్రతినెల సంచారం చేసినప్పుడు అన్ని రాశుల వారిపై స్పెషల్ ఎఫెక్ట్ పడుతుంది. దీనివల్ల కొన్ని రాశుల వారి జీవితాల్లో సానుకూల మార్పులు వస్తే.. ఈ గ్రహం అశుభ స్థానంలో ఉన్న రాశుల వారికి మాత్రం ప్రతికూల మార్పులు వస్తూ ఉంటాయి. అయితే ఈ గ్రహం శనీశ్వరుడు పాలించే కుంభ, మకర రాశిలోకి జనవరి 26వ తేదీ నుంచి ఫిబ్రవరి 27వ తేదీ వరకు సంచారం చేయబోతోంది.
బుధ గ్రహం చాలా అరుదుగా కుంభ మకర రాశిల్లోకి ప్రవేశిస్తూ ఉంటుంది. అయితే ఈ సంచారం వల్ల మేష రాశితో పాటు మిధున కన్య మకర రాశి వారు అద్భుతమైన ప్రయోజనాలు పొందగలుగుతారట. అంతేకాకుండా ఆర్థికంగా కూడా చాలావరకు లాభపడే ఛాన్స్ ఉందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ రాశులకు శని అనుగ్రహం లభించి అనుకున్న పనుల్లో విజయాలు కూడా సాధిస్తారు.
ముఖ్యంగా బుధుడు ఈ రెండు గ్రహాల్లోకి సంచారం చేయడం వల్ల మకర రాశి వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. వీరికి ఆదాయం పెరగడమే కాకుండా ఎన్నో రకాల ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభించబోతోంది. ఉద్యోగాలు చేసే వారికి ఆశించిన ప్రయోజనాలు కూడా కలుగుతాయి. ముఖ్యంగా మానసిక సమస్యలు కూడా దూరమవుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే వ్యాపారాల్లో పురోగతి లభించి అనుకున్న లాభాలు కూడా పొందగలుగుతారు.
మేష రాశి వారికి కూడా ఈ సమయం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా కోర్టు కేసుల సమస్యలతో సతమతమవుతున్న వారికి ఈ సమయంలో అనుకూలంగా పరిష్కారం లభించబోతుంది. అలాగే వృత్తిపరమైన జీవితంలో కూడా మార్పులు వస్తాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఉద్యోగాలు చేసే వారికి ఉన్నత అధికారుల సపోర్టు లభించి.. విశేషమైన ప్రయోజనాలు పొందే ఛాన్స్ ఉంది. అలాగే మేషరాశి వారు సమాజంలో గౌరవాన్ని కూడా పొందుతారు.
వృషభ రాశి వారికి కూడా బుధుడి సంచారం ఎంతో అద్భుతంగా ఉంటుంది. రెండు నెలల పాటు వీరికి ఆదాయం పరంగా వస్తున్న సమస్యలు కూడా తొలగిపోతాయి. అలాగే వీరి ప్రతిభకు తగ్గట్టుగా ఆదాయం పెరుగుతూ వస్తుంది. వృత్తి వ్యాపార జీవితాల్లో కొనసాగుతున్న వారికి శ్రమ తగ్గి ఆదాయం కూడా పెరుగుతుంది. అలాగే విదేశీ సంస్థల నుంచి వీరికి ఆహ్వానం లభించి కొత్త కొత్త డీలింగ్స్ చేసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది.
తులా రాశి వారికి ఈ సమయంలో బుధుడితో పాటు శని అనుగ్రహం లభించి అనుకున్న పనుల్లో విజయాల సాధించగలుగుతారు. అలాగే సొంతింటి కల కూడా నెరవేరుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. వీరికి ఈ సమయంలో కుటుంబ జీవితంలో కూడా సుఖ సంతోషాలు పెరుగుతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభించి ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంటుంది. అలాగే వీరు ఈ సమయంలో ఎలాంటి ప్రయత్నాలు చేసినా అద్భుతమైన లాభాలు పొందుతారు.