Rashmika Mandanna: యానిమల్స్‌తో యానిమల్ హీరోయిన్.. పెట్స్‌తో రష్మిక పిక్స్ వైరల్..

Rashmika Mandanna : రష్మిక మందన్న అసలు సిసలు ప్యాన్ ఇండియా హీరోయిన్‌గా అన్ని భాషల్లో సత్తా చూపెడుతోంది. లాస్ట్ ఇయర్ యానిమల్‌తో కథానాయికగా సత్తా చాటింది. ప్రస్తుతం ఈమె చేతిలో పలు క్రేజీ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఆ సంగతి పక్కన పెడితే.. తాజాగా ఈమె తన పెట్స్‌తో ఉన్న ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంది.  

 

1 /7

రష్మిక 2020లోనే నేషనల్ క్రష్‌గా ఎంపికై సంచలనం రేపింది  హిందీలో అమితాబ్‌తో కలిసి గుడ్ బై, మిషన్ మజ్ను, యానిమిల్ సినిమాల్లో నటించింది.

2 /7

యానిమల్ మూవీ హిందీలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్‌లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాతో రష్మిక క్రేజ్ మరో రేంజ్‌కు ఎదిగింది.

3 /7

'యానిమల్' మూవీ కంటే ముందు ఈ భామ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్‌తో చేసిన 'పుష్ప' మూవీతోనే మొదటగా ప్యాన్ ఇండియా కథానాయికగా సత్తా చాటింది.

4 /7

ప్రస్తుతం సల్మాన్ ఖాన్, మురగదాస్ కాంబినేషన్‌లో వస్తోన్న 'సికిందర్' మూవీలో కథానాయికగా నటిస్తోంది.

5 /7

అటు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో కూడా రష్మిక పేరును పరిశీలిస్తున్నారు. దీనిపై అధికారిక ప్రకటన వెలుబడాల్సి ఉంది.

6 /7

కథానాయికగా ఎంత బిజీగా ఉన్న రష్మిక తన పెట్స్ విషయంలో కేర్ తీసుకుంటూ ఉంటుంది. వీలునపుడల్లా వాటి ఆలనా పాలనా చూస్తూ ఉంటుంది.

7 /7

రష్మిక మందన్నకు ప్రముఖ సామాజిక మాధ్యమం  ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 43 మిలియన్‌కు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.