Ram Charan: రెహమాన్ కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రామ్ చరణ్..

Ram Charan: రామ్ చరణ్ తెలుగులో మెగాస్టార్ తనయుడిగా అడుగుపెట్టి గ్లోబల్ స్టార్ గా సత్తా చాటుతున్నాడు. త్వరలో శంకర్ దర్శకత్వంలో చేసిన ‘గేమ్ ఛేంజర్’ మూవీతో పలకరించబోతున్నాడు. ఆ తర్వాత బుజ్జిబాబు సన దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేయబోతున్నాడు. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ .. ఏఆర్ రెహమాన్ కోరిక మేరకు  కడప దర్గాను సందర్శించారు.

1 /5

ఇపుడు మరోసారి ఈ దర్గాను సందర్శంచడం అనీర్వచనీయ అనుభూతి అన్నారు రామ్ చరణ్. అలాగే ఎ.ఆర్‌.రెహ్మాన్‌  ఈ ద‌ర్గాలో జ‌రిగే కార్య‌క్ర‌మానికి హాజ‌రు కావాలంటూ మూడు నెల‌ల ముందే ఆహ్వానించారు. నేను కూడా వ‌స్తాన‌ని మాట ఇచ్చాను. ఆయ‌న‌కు ఇచ్చిన మాట కోసం, మాల‌లో ఉన్నా కూడా ఈ ద‌ర్గాకు వ‌చ్చానన్నారు. ఇక్క‌డ‌కు రావ‌టం ఎంతో సంతోషంగా ఉందని తన ఆనందం వెలిబుచ్చారు.

2 /5

ఈ సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ మాట్లాడుతూ.. కడప దర్గాతో నాకెంతో అనుబంధం ఉంది. ఈ ద‌ర్గా రుణం తీర్చుకోలేనిదన్నారు. నా కెరీర్‌లో స్పెషల్  గా నిలిచిన మ‌గ‌ధీర సినిమా రిలీజ్ ముందు రోజు నేను ఈ ద‌ర్గాను సంద‌ర్శించిన విషయాన్ని ప్రస్తావించారు. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యి, మంచి స్టార్ డ‌మ్ తీసుకొచ్చింది.

3 /5

మ‌రో వైపు అయ్య‌ప్ప స్వామి దీక్ష‌లో ఉన్న‌ప్ప‌టికీ రెహ్మాన్‌తో ఉన్న అనుబంధం కార‌ణంగా చరణ్ ఈ కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యారు. ఇది అక్క‌డి వారికి మెమరబుల్ గా నిలిచింది. 

4 /5

ఇక 2024లో ఇక్కడ జరిగిన 80వ జాతీయ ముషైరా గజల్ ఈవెంట్ కు రామ్ చరణ్ ను తీసుకొస్తానని చెప్పారు. ఈ నేపథ్యంలో చరణ్ ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఓ వైపు సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు రామ్ చరణ్.

5 /5

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌.. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. కడపలో ఉన్న అమీన్ పీన్ దర్గాను సందర్శించారు. అంతేకాదు కడప దర్గాలో 80వ జాతీయ ముషైరా గజల్ ఈవెంట్ కు హాజరయ్యారు. కడపలో ఉన్న ఈ దర్గాను తరుచుగా రెహమాన్ సందర్శిస్తూ మానసిక ప్రశాంతతను పొందుతూ ఉంటారు.