Sandhya Theatre stampede: పుష్ప2 మూవీ తొక్కిసలాట ఘటనలో మరో బిగ్ ట్విస్ట్ చేసుకుందని చెప్పుకొవచ్చు. ఈ నేపథ్యంలో సంధ్య థియేటర్ లైసెన్స్ ను రద్దు చేసినట్లు తెలుస్తొంది.
పుష్ప2 మూవీ ప్రస్తుతం ఒక వైపున రికార్డుల సునామీ క్రియేట్ చేస్తుందని చెప్పుకొవచ్చు. మరో వైపు ఈ సినిమా వివాదాల పరంగా అంతే వార్తలలో ఉంటుందని చెప్పుకొవచ్చు.
అల్లు అర్జున్ సినిమాకు ప్రభుత్వం బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దిల్ సుఖ్ నగర్ కు చెందిన రేవతి అనే మహిళ చనిపోయిన విషయం తెలిసిందే. ఆమె కొడుకు శ్రీతేజ్ ప్రస్తుతం సీరియస్ పరిస్థితుల్లో చికిత్స తీసుకుంటున్నాడు.
ఈ ఘటనలో ఇప్పటికే పోలీసులు సంధ్య థియేటర్ యాజమాన్యంతో పాటు.. అల్లు అర్జున్ పై కూడా కేసును నమోదు చేశారు. అదే విధంగా సంధ్య థియేటర్ యాజమాన్యం, అల్లు అర్జున్ ఇటీవల హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
అల్లు అర్జున్ ప్రస్తుతం మధ్యంత బెయిల్ మీద ఉన్నట్లు తెలుస్తొంది. మరొవైపు పోలీసులు సింగిల్ జడ్జీ ఇచ్చిన బెయిల్ ఉత్తర్వులపై మరొమారు హైకోర్టు ఆశ్రయించేందుకు రంగం సిద్దం చేసినట్లు తెలుస్తొంది.
ఈ నేపథ్యంలో చిక్కడ పల్లి పోలీసులు సంధ్య థియేటర్ యాజమాన్యంకు లైసెన్స్ ను ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తొంది.
పుష్ప2 సినిమా షో సమయంలో.. ఎక్కువ మంది అభిమానులు వస్తారని.. మూవీ టీమ్ కు తాము అనుమతి ఇవ్వలేదని పోలీసులు క్లారిటీ ఇచ్చారు. ఈ క్రమంలో ప్రస్తుతం పోలీసులు సంధ్య థియేటర్ కు మాత్రం నోటీసులు జారీ చేయడం మాత్రం వార్తలలో నిలిచిందని చెప్పుకొవచ్చు.