Prunes Health Benefits: ప్రూన్స్ నేచురల్ సూపర్ ఫుడ్ అంటారు. ఇందులో ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ప్రూన్స్‌లో విటమిన్స్, మినరల్స్‌తోపాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ప్రూన్స్‌లో డైటరీ ఫైబర్ ఉంటుంది. వీటిని మన డైట్‌లో చేర్చుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.
ప్రూన్స్‌లో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. వీటిలో పొటాషియం, ఐరన్, బోరన్ ఉంటుంది. ప్రూన్స్ తినడం వల్ల మన శరీరానికి కావాల్సిన ఖనిజాలు, విటమిన్స్ అందుతాయి. ఇవి మన శరీర ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
ప్రూన్స్ తినడం వల్ల ఆరోగ్యకరమైన పేగు కదలికలకు తోడ్పడుతుంది. ప్రూన్స్, డ్రై ప్లమ్స్‌లో పోషకాలు పుష్కలం. అంతేకాు ఇందులో ఫైబర్ కూడా ఉంటుంది. వెయిట్ లాస్ జర్నీలో ఉన్నవారు ప్రూన్స్ తినాలి. ముఖ్యంగా మహిళలకు కూడా వరం.
ప్రూన్స్ తరచూ మీ డైట్‌లో చేర్చుకోవడం వల్ల సుఖ విరోచనం కూడా అవుతుంది. మలబద్ధక సమస్య మీ దరిదాపుల్లోకి కూడా రాదు. ఇందులోని ఫైబర్, సార్బిటల్ కాంబినేషన్ జీర్ణ ఆరోగ్యానికి తోడ్పడుతుంది. మలబద్ధక సమస్యకు ఇది ఎఫెక్టీవ్ రెమిడీ.
ప్రూన్స్ ప్రీడయాబెటిక్ వారికి కూడా మేలు చేస్తుంది. ఆరోగ్యకరమైన పేగు కదలికలకు తోడ్పడుతుంది. మూడ్ స్వింగ్స్‌తో బాధపడేవారికి కూడా ప్రూన్స్ మంచివి. ప్రూన్స్‌లో ఫైటోస్ట్రోజెన్ ఈస్ట్రోజెన్‌ను ప్రభావితం చేస్తుంది.
ఇవి కాకుండా ప్రూన్స్ తీసుకోవడం వల్ల ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇది సమతుల ఆహారం. ప్రూన్స్ గుండె పనితీరుకు కూడా సహాయపడుతుంది. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి. ఎందుకంటే ఇందులో గ్లైసెమిక్ సూచీ కూడా తక్కువగా ఉంటుంది.