Bhanupriya: పెళ్లయి కూతురు పుట్టాక భర్తను వదిలేసిన ప్రభాస్‌ తల్లి ఎవరో తెలుసా?

Bhanupriya Love Marriage Breaks After Girl Child Birth: తెలుగు సినీ ప్రేక్షకులు మరచిపోలేని నటి భానుప్రియ. తెలుగులో దాదాపు 150కి పైగా సినిమాలు చేసిన ఆమె తమిళ్‌, హిందీలో కూడా నటించారు. అయితే ఆమె జీవితానికి సంబంధించి ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమె పాప పుట్టాక విడాకులు తీసుకున్నారట.

1 /9

ఆబాలగోపాలాన్ని: కాలి గజ్జె కట్టుకుని నెమలి వలె నాట్యమాడుతూ అందరినీ మైమరపించిన నటి భానుప్రియ. స్వర్ణకమలంతో ఆబాలగోపాలాన్ని అలరించిన ఆమె వందల సినిమాలు చేశారు.

2 /9

దక్షిణాదిలో: తెలుగుతోపాటు హిందీ, తమిళ్‌ సినిమాల్లో నటించి ప్రేక్షకాదరణ పొందారు. హీరోయిన్‌గా వందకు పైగా సినిమాలు చేయగా.. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గాను మెప్పించారు.

3 /9

చిగురించిన ప్రేమ: హీరోయిన్‌గా ఉన్న సమయంలో భానుప్రియ ఒకరిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. డిజిటల్‌ గ్రాఫిక్స్‌ ఇంజనీర్‌ అయిన ఆదర్శ్‌ కౌశల్‌ అమెరికాలో స్థిరపడ్డారు. వీరికి పరిచయమై ప్రేమగా మారింది.

4 /9

కుటుంబానికి వ్యతిరేకంగా: ఆదర్శ్‌తో వివాహానికి భానుప్రియ తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో కుటుంబానికి వ్యతిరేకంగా 14 జూన్‌ 1998న కాలిఫోర్నియాలో వివాహం చేసుకున్నారు.

5 /9

పాప జననం: పెళ్లయిన ఐదేళ్ల తర్వాత 2003లో ఆదర్శ్‌, భానుప్రియ దంపతులకు అభినయ కుమార్తె జన్మించింది. పాప పుట్టిన రెండేళ్ల తర్వాత భానుప్రియ, ఆదర్శ్‌ మధ్య తీవ్రస్థాయిలో విబేధాలు వచ్చాయి.

6 /9

తెగదెంపులు: గొడవలు ముదిరిపోయాయి. విబేధాలు సద్దుమణకపోవడంతో భానుప్రియ, ఆదర్శ్‌ 2005లో విడాకులు తీసుకున్నారు. వారి వివాహ బంధాన్ని తెగదెంపులు చేసుకుని విడిపోయారు.

7 /9

చెన్నైకి మకాం: విడిపోయిన అనంతరం కూతురు అభినయను తీసుకుని అమెరికా వదిలేసి భానుప్రియ తన స్వస్థలం చెన్నైకి వచ్చి స్థిరపడింది.

8 /9

రీఎంట్రీ: ప్రస్తుతం భానుప్రియ కుమార్తెతో కలిసి ఉంటోందని సమాచారం. విడాకుల తర్వాత కొన్నేళ్లు సినిమాల్లో నటించింది.

9 /9

క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా: ఛత్రపతి సినిమాలో ప్రభాస్‌ తల్లిగా భానుప్రియ నటించిన విషయం తెలిసిందే. నవదీప్‌ గౌతమ్‌ ఎస్సెస్సీ సినిమాలో కూడా మెరిశారు.