Weight Loss: బంగాళదుంపలు ఇలా తింటే ఈజీగా సన్నబడతారు..!

Potatoes For Weight Loss: బరువు తగ్గాలనుకునేవారికి బంగాళదుంప కూడా వరం. ఎందుకంటే వీటిని మీ డైట్లో చేర్చుకుని ఈజీగా బరువు తగ్గవచ్చు. మంచి డైట్‌, నిద్ర, స్ట్రెస్‌ వంటివి పాటిస్తే బరువు ఈజీగా తగ్గిపోతారు. క్యాలరీలు తక్కువగా తీసుకోవడం వల్ల కూడా బరువు పెరగకుండా ఉంటారు.
 

1 /5

బంగాళదుంపలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కార్బొహైడ్రేట్స్‌ ఉంటాయి కాబట్టి ఎక్కువ సమయం పాటు ఆకలి వేయదు.  బంగాళదుంపలో విటమిన్‌ సీ, బీ6 ఉంటాయి. ఇది ఇమ్యూనిటీ, బ్రెయిన్‌ పనితీరుకు సహాయపడుతుంది. ఇందులో పొటాషియం కూడా ఉంటుంది కాబట్టి బ్లడ్‌ ప్రెజర్‌ను నిర్వహిస్తుంది. ముఖ్యంగా బంగాళదుంపలో డైటరీ ఫైబర్‌ ఉంటుంది.  ఇది జీర్ణక్రియకు తోడ్పడుతుంది.  సమతుల ఆహారంలో భాగం కాబట్టి బరువు కూడా తగ్గిపోతారు.  

2 /5

క్యాలరీలు తక్కువ.. బంగాళదుంపలు ఉడికించి తీసుకుంటాం కాబట్టి క్యాలరీలు తక్కువ. కార్బొహైడ్రేట్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఒక మీడియం సైజు బంగాళదుంపలో 110 క్యాలరీలు ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవారికి ఇది బెస్ట్‌ ఆప్షన్‌.

3 /5

ఫైబర్‌.. బంగాళదుంపలో డైటరీ ఫైబర్‌ ఉంటుంది. వీటిని డైట్లో చేర్చుకోవడం వల్ల కడుపు నిండిన అనుభూతి ఎక్కువ సమయం పాటు కలుగుతుంది. ఇది బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ కూడా అదుపులో ఉంచుతుంది. దీంతో అతిగా తినకుండా ఉంటారు.

4 /5

స్టార్చ్.. బంగాళదుంపలు ఉడికించి చల్లార్చినప్పుడు ఇందులో గంజి వంటి నిరోధకత ఏర్పడుతుంది. ఇది ఫైబర్‌లా పనిచేస్తుంది. దీంతో కడుపు ఆరోగ్యం కూడా బాగుంటుంది. క్యాలరీలు తక్కువగా ఉంటాయి. క్యాలరీలు తక్కువగా తీసుకుంటారు.  

5 /5

గ్లైసెమిక్‌ సూచీ.. బంగాళదుంపలో గ్లైసెమిక్‌ సూచీ కూడా తక్కువగా ఉంటుంది. ఇది ఉడికించి చల్లాబరచి తీసుకుంటాం కాబట్టి ఇందులో గ్లైసెమిక్ సూచి తక్కువగా ఉంటుంది. కొన్ని నివేదికల ప్రకారం రక్తంలో చక్కెర స్థాయిలు మెల్లిగా పెరుగుతాయి. ఎనర్జీ డిప్స్‌ వంటివి తీసుకోకుండా వీటిని మీ డైట్లో చేర్చుకోవచ్చు.