Bank Holiday: రేపు బ్యాంకులు బంద్‌ ఉంటాయా? శనివారం 7వ తేదీ బ్యాంక్‌ హాలిడేనా? ఓసారి చెక్‌ చేసుకోండి..

Ganesh Chaturthi 2024 Bank Holiday: ఆర్‌బీఐ గైడ్‌లైన్స్‌ ప్రకారం బ్యాంకులకు కొన్ని ప్రత్యేక పండుగ సందర్భాట్లో సెలవులు పాటిస్తాయి. ముఖ్యంగా ఈ సెప్టెంబర్‌ మాసంలో సగం నెల బ్యాంకులకు సెలవులు రానున్నాయి. ఈ సందర్భంగా రేపు శనివారం 7వ తేదీ వినాయక చవితి సందర్భంగ బ్యాంకులకు సెలవు ఉందా? లేదా? ఓసారి చెక్‌ చేయండి..
 

1 /5

కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కొన్ని ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు ప్రకటిస్తారు. ముఖ్యంగా కొన్ని ప్రాంతీయ పండుగల సందర్భంగా ఆ ప్రాంత పరిధిలో పనిచేస్తున్న బ్యాంకులకు మాత్రమే సెలవు ప్రకటిస్తారు. అందుకే బ్యాంకు పని ఉన్నవాళ్లు మందుగానే తెలుసుకుని వెళ్లాలి. లేకపోతే, సమయం వృథా అవుతుంది ఇబ్బందులు కూడా పడతారు.  

2 /5

రేపు వినాయక చవితి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకు హాలిడే ఉందా ? లేదా? తెలుసుకుందాం. ఆర్‌బీఐ బ్యాంక్‌ హాలిడే జాబితా ప్రకారం రేపు సెప్టెంబర్‌ 7వ తేదీ బ్యాంకులు బంద్‌ ఉంటాయి. ఈ రోజు గణేష్‌ చతుర్థి లేదా వరసిద్ధి వినాయక వ్రతం కొన్ని రాష్ట్రాల్లో అంగరంగ జరుపుకుంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా వేడుకగా జరుపుకుంటారు కాబట్టి రేపు బ్యాంకులకు సెలవు ప్రకటించింది ఆర్‌బీఐ.  

3 /5

ఆర్‌బీఐ సెలవుల జాబితా క్యాలెండర్‌ ప్రకారం వినాయక చవితి సందర్భంగా ముంబై, నాగ్‌పూర్‌, పనాజీ, అహ్మదాబాద్‌, బెలాపూర్‌, బెంగళూరు, చెన్నై, భువనేశ్వర్‌, హైదరాబాద్‌ (ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ)లలో బ్యాంకులు బంద్‌ ఉంటాయి. రేపు వినాయక చవితి, 8వ తేదీ ఆదివారం సందర్భంగా బ్యాంకులు బంద్‌ ఉంటాయి. మిగతా రాష్ట్రాల్లో యథావిధిగా కొనసాగుతాయి.  

4 /5

సెప్టెంబర్‌ బ్యాంక్‌ సెలవుల జాబితా.. సెప్టెంబర్‌ 7: వినాయక చవితి, సెప్టెంబర్‌ 14: ఓనం, రెండో శనివారం సెప్టెంబర్‌ 16: మిలాద్ ఉన్‌ నాబి సెప్టెంబర్ 17 ఇంద్రజాత్ర, ఈద్ ఎ మీలాద్ సిక్కిం, ఛత్తీస్ గఢ్‌లో సెలవు సెప్టెంబర్ 18 పాంగ్ లాబ్సోల్ సిక్కింలో సెలవు సెప్టెంబర్ 20 మీలాద్ ఉన్ నబి సెలవు జమ్ము శ్రీనగర్ సెప్టెంబర్ 21 శ్రీ నారాయణ గురు సమాధి రోజు (కేరళ)

5 /5

సెప్టెంబర్ 22 ఆదివారం సెలవు సెప్టెంబర్ 23 మహారాజ హరి సింగ్ జి జమ్ము శ్రీనగర్‌లో సెలవు సెప్టెంబర్ 28 నాలుగో శనివారం సెలవు సెప్టెంబర్ 29 ఆదివారం సెలవు