PM Kisan: పీఎం కిసాన్ నిధుల విడుదల.. నగదు జమా వివరాలను ఇలా ఈజీగా తెలుసుకోండి..


Pm kisan 17 th instalment: ప్రధాని మోదీ ఈరోజు వారణాసిలో దేశంలోని..  రైతుల అకౌంట్లలో రూ.20 వేల కోట్లను బదిలీ చేశారు. కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద..  17వ విడతను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. 

1 /8

నరేంద్రమోదీ ఇటీవల ఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము మోదీ చేత మూడోసారి ప్రమాణ స్వీకారం చేయించారు. మోదీతో పాటు, 71 మంది కేంద్రమంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు.

2 /8

ఇక మోదీ ప్రమాణ స్వీకరం చేశాక తన కార్యాలయంలో తొలిసంతకం కిసాన్ సమ్మాన్ 17 వ ఇన్ స్టాల్ మెంట్ డబ్బుల చెల్లింపు ఫైల్ మీద సంతకం చేశారు. కేంద్ర ప్రభుత్వం 2018 నుంచి ఈ పథకం అమలు చేస్తుంది. 

3 /8

ముఖ్యంగా రైతులకు పెట్టుబడి సహయం అందించడమే టార్గెట్ గా మోదీసర్కారు ఈ పథకం తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. రైతులు ఆనందగా ఉంటేనే.. దేశం బాగుపడుతుందని మోదీ తరచుగా చెబుతుంటారు. 

4 /8

ప్రతి ఏటా అర్హులైన రైతులకు ఏటా మూడు విడతల్లో రూ. 2 వేల చొప్పున మొత్తం రూ. 6 వేలు పెట్టుబడి సాయంగా కేంద్ర ఇస్తుంది. దీనిలో భాగంగానే మోదీ ఈరోజు వారణాసిలో పీఎం కిసాన్ సమ్మాన్ 17  వ విడత నిధులను విడుదల చేశారు. 

5 /8

దీంతో 9.26 కోట్లు రైతుల ఖాతాల్లో రూ. 2 వేల చొప్పున, దేశంలో రూ. 20 వేల కోట్లు జమకానున్నాయి.. లోక్ సభ ఎన్నికలలో విజయం సాధించిన తర్వాత మోదీ తొలిసారి వారణాసికి వెళ్లారు. 

6 /8

PM కిసాన్ సమ్మాన్ నిధి యోజన యొక్క 17వ విడత డబ్బు మీ ఖాతాలో జమ అయ్యిందో లేదో ఇలా తెలుసుకోవచ్చు. మొదట మీ అకౌంట్ లో డబ్బులు జమకాగానే.. అకౌంట్ అనుసంధానం ఉన్న ఫోన్ కు మెస్సెజ్ వస్తుంది. 

7 /8

మీ మొబైల్ నంబర్‌కు మెసేజ్ రాకపోతే... మీ సమీపంలోని ATM ను సందర్శించాలి. ఏటీఎం మెషీన్‌లోని మినీ స్టేట్‌మెంట్‌ను బయటకు తీయడం ద్వారా 17వ విడత డబ్బు ఖాతాలోకి బదిలీ అయిందో లేదో తెలుసుకోవచ్చు. 

8 /8

మీ ఖాతాలో వాయిదా డబ్బులు రాలేదని మీరు భావిస్తే... ఈ పరిస్థితిలో మీరు చింతించాల్సిన అవసరం లేదు. మీరు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన వెబ్‌సైట్  https://www.pmkisan.gov.in/Contacts.aspx ని సందర్శించడం ద్వారా మీ సమస్య గురించి సంప్రదించవచ్చు  .