Padma Bhushan 2025: బాలకృష్ణ, అజిత్ సహా సినీ రంగం నుంచి పద్మభూషణ్ అందుకోబోతున్న సినీ ప్రముఖులు..

Padma Bhushan Awards  2025: కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్.. 76వ గణతంత్య్ర దినోత్సవం సందర్భంగా పద్మ పురస్కారాలను ప్రకటించింది. ఇందులో సినీ రంగం నుంచి పలువురు ప్రముఖులకు  పద్మఅవార్డులు ప్రకటించారు. అందులో తెలుగు అగ్ర కథానాయకుడిగా 50 యేళ్లుగా సత్తా చాటుతున్న నందమూరి బాలకృష్ణను కేంద్రం పద్మభూషణ్ తో సత్కరించింది. ఈయనతో పాటు తమిళ అగ్ర హీరో అజిత్, శోభన సహా ఇతర సినీ ప్రముఖులకు పద్మ అవార్డులు ప్రకటించడం విశేషం.

1 /7

తాజాగా కేంద్రం దక్షిణాదికి చెందిన నాలుగు రాష్ట్రాల్లో నలుగురి సినీ ప్రముఖులకు పద్మభూషణ్ అవార్డులు ప్రకటించారు. ఏపీ నుంచి బాలకృష్ణ... తమిళనాడు నుంచి అజిత్.. అదే రాష్ట్రం నుంచి కేరళకు చెందిన శోభనకు.. కర్ణాటక నుంచి అనంత్ నాగ్ కు పద్మ అవార్డులు ప్రకటించారు. అటు బాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కపూర్ కు కూడా పద్మభూషణ్ ప్రకటించడం విశేషం.

2 /7

పద్మభూషణులు.. ఇక వెండితెరపై ఒకే సినిమాలో హీరో, హీరోయిన్లుగా నటించిన బాలకృష్ణ, శోభన లకు కూడా ఒకేసారి పద్మభూషణ్ అవార్డులు ప్రకటించడం విశేషం. వీళ్లిద్దరు మువ్వగోపాలుడు, నారీ నారీ నడుమ మురారి సినిమాల్లో కలిసి నటించడం విశేషం.

3 /7

నందమూరి బాలకృష్ణ.. దేశ అత్యున్నత పురస్కారాల్లో తెలుగు వారు సత్తా చాటారు. తెలుగు సీనియర్ అగ్ర హీరో నందమూరి బాలకృష్ణకు కేంద్రం పద్మభూషణ్ పురస్కారం ప్రకటించింది. అంతేకాదు తెలుగు సహా దక్షిణాది నుంచి తండ్రి తర్వాత కుమారుడిగా పద్మ అవార్డు అందుకున్న హీరోగా బాలయ్య రికార్డు క్రియేట్ చేసారు. బాలకృష్ణ హీరోగా 50 యేళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్బంగా ఈ అవార్డు రావడం పట్ల నందమూరి ఫ్యాన్స్ తో పాటు సినీ పరిశ్రమ ఆనందం వ్యక్తం చేస్తోంది.

4 /7

అజిత్ కుమార్.. తమిళ అగ్రహీరోగ 3 దశాబ్దాలుగా అలరిస్తున్న అజిత్ కుమార్ ను కేంద్రం పద్మభూషణ్ ప్రకటించింది. ఈయన తెలుగు సినిమా ప్రేమ పుస్తకం సినిమాతో పరిచయం అయ్యారు.

5 /7

శోభన.. తెలుగు సహా దక్షిణాది సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అలరించిన శోభన కు కేంద్రం పద్మభూషణ్ ప్రకటించింది. గతంలో ఈమెకు పద్మశ్రీ అవార్డు రావడం విశేషం.

6 /7

అనంత్ నాగ్.. కన్నడ సీనియర్ యాక్టర్ అనంత్ నాగ్ కు కేంద్రం పద్మభూషణ్ అవార్డుతో గౌరవించింది. కన్నడలో పలు చిత్రాల్లో హీరోగా  క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

7 /7

శేఖర్ కపూర్.. హిందీ చిత్ర సీమలో మిస్టర్ ఇండియా, బండిత్ క్వీన్ వంటి క్లాసిక్ మూవీస్ తో అలరించిన శేఖర్ కపూర్ కు కేంద్రం పద్మ భూషణ్ తో గౌరవించింది. ఈయనతో పాటు బెంగాలీ సింగర్ అర్జిత్ సింగ్ కు పద్మశ్రీ ప్రకటించిన కేంద్రం.