మనిషి శరీరానికి వివిధ రకాల విటమిన్లు, మినరల్స్ చాలా అవసరం. శరీర నిర్మాణం, ఎదుగుదలలో విటమిన్ బి12 లేదా కోబాలమిన్ అత్యంత కీలకం.శరీరం మెటబోలిజంను వేగవంతం చేస్తుంది. అందుకే విటమిన్ బి12 లోపం లేకుండా జాగ్రత్త పడాలి. ఈ నేపధ్యంలో విటమిన్ బి12 పుష్కలంగా ఉండే 5 పదార్ధాలు ఏవో తెలుసుకుందాం
Vitamin B12 Rich Foods in Telugu: మనిషి శరీరానికి వివిధ రకాల విటమిన్లు, మినరల్స్ చాలా అవసరం. శరీర నిర్మాణం, ఎదుగుదలలో విటమిన్ బి12 లేదా కోబాలమిన్ అత్యంత కీలకం.శరీరం మెటబోలిజంను వేగవంతం చేస్తుంది. అందుకే విటమిన్ బి12 లోపం లేకుండా జాగ్రత్త పడాలి. ఈ నేపధ్యంలో విటమిన్ బి12 పుష్కలంగా ఉండే 5 పదార్ధాలు ఏవో తెలుసుకుందాం
ఫోర్టిఫైడ్ ధాన్యం మీరు ఒకవేళ శాకాహారులైతే రోజూ డైట్‌లో ఫోర్టిఫైట్ ధాన్యం ఉండేట్టు చూసుకోవాలి. వీటిలో విటమిన్ బి 12 పెద్దఎత్తున ఉంటుంది
చేపలు చేపలు కూడా విటమిన్ బి12కు మంచి సోర్స్. ముఖ్యంగా ట్యూనా, సాల్మన్, సార్డన్, ట్రౌట్ వంటి చేపలు తీసుకోవాలి. ఒక కప్పు లేదా 150 గ్రాముల సార్డిన్ చేపలో 554 శాతం విటమిన్ బి12 ఉంటుంది.
గుడ్లు ఇదొక సూపర్‌ఫుడ్. ఇందులో ప్రోటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ప్రత్యేకించి విటమిన్ బి12, బీ2 అత్యధికంగా ఉంటాయి. ఒక బాయిల్డ్ ఎగ్లో దాదాపుగా 1.6 మైక్రోగ్రాముల విటమిన్ బి12 ఉంటుంది.
పాలు పాలను సూపర్ ఫుడ్ అంటారు. ఇందులో విటమిన్ బి12 పుష్కలంగా ఉంటుంది. రోజూ ఒక గ్లాసు పాలు తాగితే శరీరానికి కావల్సిన కీలక పోషకాలు అందుతాయి
చికెన్ చికెన్‌లో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. దాంతోపాటే విటమిన్ బి12 కూడా పెద్దమొత్తంలో ఉంటుంది. అయితే తక్కువ నూనెతో వండుకుని తినాలి