Niharika Konidela: నిహారిక కొణిదెల విషయానికొస్తే.. మెగా కుటుంబం నుంచి నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఫస్ట్ కథానాయికగా రికార్డ్ క్రియేట్ చేసింది. తెలుగు సినీ ఇండస్ట్రీలో నిహారిక తన కంటూ సెపరేట్ గుర్తింపు తెచ్చుకుంది. ఒక వైపు హీరోయిన్‌గా నటిస్తూనే .. నిర్మాతగా పలు వెబ్ సిరిస్‌లు నిర్మిస్తూ నటిస్తోంది.
నిహారిక మెగా కుటుంబం నుంచి వచ్చిన తొలి కథానాయిక. నాగబాబు కూతురుగా తనదైన నటనతో పాటు ఆటిట్యూట్‌తో ప్రేక్షకుల్లో సెపరేట్ ఇమేజ్ సంపాదించుకుంది. నిహారిక సినిమాల కంటే సోషల్ మీడియా ద్వారానే ప్రేక్షకులకు చేరువ అయింది.
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎక్కువ మంది హీరోలున్న మెగా ఫ్యామిలీ నుంచి కథానాయికగా అడుగు పెట్టడం అంటే మాములు విషయం కాదు. ఆ కుటుంబం నుంచి వచ్చినా.. తన కంటూ సెపరేట్ ఇమేజ్ సంపాదించుకుంది.
నిహారిక.. ఆ మధ్య ప్రముఖ పోలీస్ అధికారి కుమారుడైన చైతన్య జొన్నలగడ్డను ఇంటి పెద్దల సమక్షంలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంది. ఆ తర్వాత విభేదాల కారణంగా అతనికి డైవోర్స్ ఇచ్చి మరోసారి వార్తల్లో నిలిచింది.
నిహారిక నటిగానే కాకుండా... ఎంటర్ ప్రెన్యూర్‌గానే కాకుండా.. నిర్మాతగా బహుముఖ ప్రజ్ఞ ప్రదర్శిస్తోంది.
తన భర్తతో విడాకుల తర్వాత సినిమాలు, వెబ్ సిరీస్‌లే లోకంగా కాలం వెల్లదీస్తోంది నిహారిక. అంతేకాదు పింక్ ఎలిఫెంట్ బ్యానర్ పై సినిమాలు, వెబ్ సిరీస్‌లతో ఫుల్ బిజీగా ఉంది.