Niharika Konidela Marriage: రీసెంట్ గా నాగ చైతన్య శోభితా ధూళిపాళ్లను రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించారు. అంతేకాదు వీళ్లిద్దరు నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. అదే రూట్లో నిహారిక కొణిదెల కూడా రెండో పెళ్లికి రెడీ అయిందా.. ? అవుననే అంటున్నాయి మెగా ఫ్యామిలీ వర్గాలు.
నిహారిక: నిహారిక విషయానికొస్తే.. చిరంజీవి ఫ్యామిలీ నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి హీరోయిన్ గా అటు మెగా ఫ్యామిలీ ట్యాగ్‌తో సినీ ఇండస్ట్రీలో నిహారిక ఆమె కంటూ పెపరేట్ గుర్తింపు తెచ్చుకుంది.
మెగా డాటర్.. నిహారిక మెగా డాటర్‌గా తనదైన యాక్టింగ్‌తో పాటు ఆటిట్యూట్‌తో ఆడియన్స్ లో సెపరేట్ ఇమేజ్ సంపాదించుకుంది. నిహారిక సినిమాల కంటే సోషల్ మీడియా ద్వారానే ప్రేక్షకులకు చేరువ అయిందనే చెప్పాలి.
నిహారిక పెళ్లి.. నిహారిక.. ఆ మధ్య ప్రముఖ పోలీస్ అధికారి కుమారుడు చైతన్య జొన్నలగడ్డను పెళ్లి చేసుకొంది. ఆ తర్వాత అతనితో విభేదాల కారణంగా విడాకులు ఇచ్చి మరోసారి వార్తల్లో నిలిచింది.
నిర్మాతగా.. నటిగా.. ఎంటర్ ప్రెన్యూర్గానే కాకుండా.. నిర్మాతగా బహుముఖ ప్రజ్ఞ ప్రదర్శిస్తోంది. నిహారిక.. తన భర్తతో విడాకుల తర్వాత సినిమాలు, వెబ్ సిరీస్‌లు లోకంగా కాలం వెల్లదీస్తోంది. తాజాగా ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమాతో నిర్మాతగా మంచి సక్సెస్ అందుకుంది.
నిహారిక రెండో పెళ్లి.. తాజాగా నిహారిక రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు సినీ ఇండస్ట్రీకి చెందిన బడా ఫ్యామిలీ హీరోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు సమాచారం.