ఆటో ఎక్స్‌పో-2018: మార్కెట్ లోకి కొత్త మారుతీ సుజుకీ స్విఫ్ట్ విడుదల

  • Feb 21, 2018, 17:56 PM IST
1 /6

మార్కెట్ లోకి కొత్త మారుతీ సుజుకీ స్విఫ్ట్ విడుదల  

2 /6

తేలికపాటి బరువున్న కార్లను రూపొందే హార్టెక్ ఫ్లాట్‌ఫామ్ మీద ఈ మారుతీ స్విఫ్ట్ ను రూపొందించారు. దీంతో ఇది చాలా తేలికగా ఉండబోతుంది. నేవిగేషన్‌ను సపోర్టు చేసే 7 అంగుళాల టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌ను ఇది కలిగి ఉంది. బ్లూటూత్‌ కనెక్టివిటీ, ఆండ్రాయిడ్‌ ఆటో, ఆపిల్‌ కారు ప్లే వంటివి  దీనిలో ఉన్నాయి.

3 /6

కొత్త స్విఫ్ట్ డిజైన్: క్రోమ్‌ ఇన్‌సెర్ట్స్‌తో హెక్సాగోనల్‌ గ్రిల్‌ను, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్స్‌, ఎల్‌ఈడీ టైల్‌ ల్యాంప్స్‌తో ప్రాజెక్టర్‌ హెడ్‌ల్యాంప్స్‌, ఫాగ్‌ ల్యాంప్స్‌

4 /6

ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న స్విఫ్ట్‌ ధర: రూ.4.89 లక్షల నుండి రూ.7.55 లక్షలు . కొత్త దానిలో ఫీచర్లను అధికంగా అందిస్తుండటంతో, ధర ప్రస్తుతమున్న దానికంటే మరో 25% వరకు పెరిగే అవకాశం కనిపిస్తోంది.

5 /6

1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్, 1.3 లీటర్ డీజిల్ ఇంజన్ తో, కొత్త స్విఫ్ట్ భారత మార్కెట్ లోకి అందుబాటులో రానుంది. 

6 /6

మారుతీ స్విఫ్ట్ డిజైర్. పాత మోడల్‌తోనే ఇప్పటికే పాపులర్‌ కారుగా పేరు తెచ్చుకున్న ఈ స్విఫ్ట్‌, కొత్త రూపకల్పనతో మరింతగా ఆకట్టుకుంది. ప్రస్తుతమున్న కారు మైలేజీ: 25.4 కి.మీ/లీటర్. కానీ కొత్త మోడల్ మారుతీ స్విఫ్ట్ డిజైర్ 26 కి. మీ/ లీటర్ ఇస్తుంది.