Balakrishna Success: నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అటు రాజకీయాలలో ఇటు సినిమాల పరంగా సక్సెస్ అందుకుంటూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయనకు సంబంధించిన కొన్ని విషయాలు.. కూడా వైరల్ గా మారుతున్నాయి.
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు బాలకృష్ణ. ఈ వయసులో కూడా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా బాలకృష్ణ ఆ సినిమాలతో సూపర్ హిట్ విజయాలను అందుకుంటూ మరింత పాపులారిటీ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బాలయ్యకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. బాలకృష్ణ సినిమాల పరంగా ఇంత సక్సెస్ పొందడానికి కారణం ఆ ఇద్దరే అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.
అసలు విషయంలోకి వెళ్తే.. నటసింహ నందమూరి బాలకృష్ణ రాజకీయాలలో వరుస హ్యాట్రిక్ అందుకుంటూ దూసుకుపోతున్నారు. ముఖ్యంగా హిందూపురం ఎమ్మెల్యేగా ఏకంగా మూడుసార్లు విజయం అందుకొని, అసెంబ్లీలో అడుగుపెట్టి, తన గొంతు వినిపిస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది.
అలాగే సినిమాలలో కూడా వరుస విజయాల అందుకుంటూ దూసుకుపోతున్నారు. ముఖ్యంగా అఖండ సినిమా మొదలుకొని వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, ఇప్పుడు డాకు మహారాజ్ ఇవన్నీ కూడా విజయం సాధించడం వెనక కారణం బాలయ్య చిన్న కూతురు తేజస్విని ఉన్నట్లు తెలుస్తోంది. కథ విషయంలోనే కాదు ఆయనకు సంబంధించిన అన్ని విషయాలలో కూడా జోక్యం కలగజేసుకుంటూ తండ్రి సక్సెస్ కు కారణమవుతోంది తేజస్విని
అలాగే బాలయ్య అన్ స్టాపబుల్ షో కి హోస్ట్ గా సక్సెస్ అవడం వెనుక కూడా బాలయ్య చిన్న కూతురు తేజస్విని ఉన్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని బాలయ్య ఎన్నోసార్లు మీడియా ముఖంగా తెలియజేశారు కూడా. ఇక ఇప్పుడు మరొక వ్యక్తి ఎస్ఎస్ తమన్ అన్నట్టు తెలుస్తోంది. అఖండ మొదలుకొని ఇప్పుడు డాకు మహారాజ్ వరకు బాలయ్య అన్ని సినిమాలకు తమ ప్రాణం పెట్టి మరి బిజిఎం అందిస్తున్నారు.
ముఖ్యంగా కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రజనీకాంత్ కి అనిరుద్ రవిచంద్రన్ ఎలా అయితే సక్సెస్ లో భాగమవుతున్నారో.. ఇక్కడ బాలకృష్ణకి తమన్ అలాగే సహాయపడుతున్నారు అని కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా బాలయ్య సక్సెస్ కి వీరిద్దరూ కారణమని తెలిసి అభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.