Nabha Natesh: రీ ఎంట్రీ మూవీపై నభా నటేష్ ఆశలు.. డార్లింగ్ మూవీతో ఇస్మార్ట్ పోరి హిట్టు కొట్టినట్టేనా..

Nabha Natesh: నభా నటేష్ కన్నడ భామ అయినా.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.  ఆ మధ్య యాక్సిడెంట్ కారణంగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ భామ.. తాజాగా ‘డార్లింగ్’ మూవీతో తెలుగులో రీ ఎంట్రీ ఇస్తుంది. ఈ మూవీతో ఇస్మార్ట్ పోరి ఒకప్పటిలా స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ ఈమె దశ తిరుగుతుందా లేదా అనేది చూడాలి.

1 /6

నభా నటేష్ .. కన్నడ భామ అయినా.. తెలుగులో  రామ్ పోతినేని హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీతో కథానాయికగా ఓవర్ నైట్ పాపులర్ అయింది. ఆ తర్వాత వరుస సినిమాలు చేసినా.. మధ్యలో చిన్న యాక్సిడెంట్ కారణంగా సినిమాలకు దూరంగా ఉంది.

2 /6

తెలుగులో సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ 'నన్ను దోచుకుందువటే' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది నభా.

3 /6

చేసినవి కొన్ని చిత్రాలైనా.. తన గ్లామర్ షో మరియు నటనతో యూత్‌కు ఫేవరేట్ హీరోయిన్ గా అయింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఈమె కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. ఇక  తెలుగులో చివరగా నితిన్ హీరోగా తెరకెక్కిన ‘మేస్ట్రో’ తర్వాత ఈ భామ ఒక్క సినిమా చేయలేదు.

4 /6

అప్పట్లో నభా నటేష్ యాక్సిడెంట్ కు గురైయింది. దీంతో సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంది. తాజాగా ‘డార్లింగ్’ మూవీతో రీ ఎంట్రీ ఇస్తుంది. దాంతో పాటు  ‘స్వయంభూ’ సహా పలు చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది.    

5 /6

నభా నటేష్ నటించిన ‘డార్లింగ్’ మూవీ విషయానికొస్తే..  ఈ సినిమాలో నభా.. స్పిట్ పర్సనాలిటీతో బాధ పడే అమ్మాయి పాత్రలో కనిపించనుంది. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

6 /6

నభా నటేష్... శాండిల్ వుడ్ ఇండస్ట్రీలో శివరాజ్ కుమార్ హీరోగా నటించిన 'వజ్రకాయ' మూవీతో వెండితెరపై కథానాయికగా పరిచయమైంది.