Most Expensive Banana: రూ.52 కోట్ల అరటి పండు చూశారా?.. ఇది చూడని వారి కోసం!


Most Expensive Banana: ఓ బనానా కళ్లు చెదిరే ధరకు అమ్ముడైంది. ఏకంగా ఓ వ్యక్తి దాదాపు రూ.52 కోట్లకు కొనుగోలు చేశారు. ఇంతకీ ఆ అరటి పండులో ఉన్న ప్రత్యేకత ఏంటో పూర్తి వివరాలు తెలుసుకోండి. 

Most Expensive Banana: మార్కెట్‌లో అరటి పండ్లు డజన్‌ రూ.60 నుంచి రూ.80 ధరకు విక్రయిస్తారు. కానీ ఇటీవలే సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న అక్షరాల రూ.52 కోట్లు.. అంతేకాకుండా ఇది డజన్‌, అర డజన్‌ కాదు.. కేవలం ఒక్క అరటి పండుకే ఈ ధర.. అలాగే దీనిని పోటీ పడీ వేలంలో కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇంతకీ ఒక్క అరటి పండు ఇంత రేటు పలకడానికి ప్రధాన కారణాలేంటో పూర్తి వివరాలు తెలుసుకోండి.

1 /5

ఈ అరటి పండుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. గోడకు అంటించి ఉన్న చిన్న అరటి పండుకు వేలం వెయ్యగా.. ఓ వ్యక్తి దాదాపు రూ.52 కోట్లకు ఈ అరటి పండును సొంతం చేసుకున్నాడు. 

2 /5

ఇలా రూ.52 కోట్లకు అరటి పండు అమ్ముడు పోవడం ఇప్పుడూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. న్యూయార్క్‌లో  ఇటీవలే జరిగిన ఆర్ట్‌ వేలంలో భాగంగా ఓ మిలియనిర్‌ ఈ ఆరటి పండు ఆర్ట్‌ను కొనుగోలు చేశాడు. 

3 /5

బనానా టేప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇది రూ.52 కోట్ల పాటు పలకడం ప్రస్తుతం చర్చనీయంగా మారింది. దీనిని ప్రముఖ ఇటాలియన్‌ ఆర్టిస్ట్‌ మౌరిజియో కాటెలాన్‌ సృష్టించిగా.. ఓ సంస్థ ఈ వేలాన్ని నిర్వహించింది.  

4 /5

దీనిని ఇటాలియన్‌ ఆర్టిస్ట్‌  మొదట 2019 సంవత్సరంలో ఆర్ట్‌ వర్క్‌ను ప్రదర్శించిన సంగతి తెలిసిందే.. అయితే ఈ ఆర్ట్‌లో ఉండే బనానాను ప్రతి మూడు రోజులకు ఒకసారి మార్చాల్సి ఉంటుంది. 

5 /5

 2019లో  జరిగిన వేలంలో భాగంగా ఈ బనానా ఆర్ట్‌కి ఎవ్వరూ ఊహించని స్థాయిలో విక్రయించగా.. 5 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ ఆర్ట్‌పై వేలాన్ని నిర్వహించగా దాదాపు రూ.98 లక్షలకు విక్రమైంది.