Snake Predators: కింగ్ కోబ్రా పేరు వినగానే అందరికీ వణుకు పుడుతుంది. ప్రపంచంలోనే అతి పొడవైన అత్యంత విషపూరితమైన పాము ఇది. కింగ్ కోబ్రా కాటేస్తే క్షణాల్లో మరణం తధ్యం. అయితే ఇంత ప్రమాదకరమైన విషపూరితమైన కింగ్ కోబ్రాను బతికుండగానే నమిలి తినేసే జంతువులున్నాయని తెలుసా.. ఆ జంతువులేంటో తెలుసుకుందాం
రాబందు కింగ్ కోబ్రాకు అత్యంత ప్రమాదకర ప్రత్యర్ధి ఇది. చాలా పైనుంచి వీటిని పసిగట్టి వేగంగా వచ్చి కాళ్లతో పట్టుకుని చంపేస్తాయి, వీటి నుంచి తప్పించుకోవడం కింగ్ కోబ్రాకు సాధ్యం కాదు.
రక్కూన్ ఇవి కింగ్ కోబ్రాను పట్టుకుని తినడంలో స్పెషలిస్టులు. పాము తలపై దాడి చేస్తాయి. పామును లాగి మరీ చంపుతాయి. అత్యంత దారుణంగా చంపుతాయి
అడవి పంది అడవి పంది కూడా కింగ్ కోబ్రాను తన పదునైన దంతాలతో నమిలి చంపగలవు. కింగ్ కోబ్రాను తుక్కు తుక్కు చేస్తాయి.
ముంగిస కింగ్ కోబ్రాలే కాదు పాము జాతి అన్నింటికీ ముంగిస అంటే హడల్. పాముల్ని చంపడంలో ఇవి ప్రత్యేకం. ఇవి చాలా తెలివైనవి అత్యంత వేగంగా వేటాడగలవు. పాము తలపై కొరికి చంపేస్తాయి
గెద్ద తెల్లగా వైట్ బ్యాలిడ్ సీ ఈగల్...కింగ్ కోబ్రాలను వేటాడి చంపడంంలో వాటికవే సాటి. ఇవి ఆకాశం నుంచి ఎగురుకుంటూ వచ్చి దాడి చేస్తాయి. మైళ్ల దూరం వరకూ గాలిలో ప్రయాణిస్తాయి. అంత దూరం నుంచే వేటను పసిగట్టి వస్తాయి. వీటి నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు
మొసలి మొసలి ..కింగ్ కోబ్రాను తన పదునైన, శక్తివంతమైన దవడ కింద బిగబట్టి నమిలి తినేయగలవు లేదా అలాగే మింగేయగలవు. ఇవి నీటిలోనూ, భూమ్మీద కూడా కింగ్ కోబ్రాలను వేటాడుతాయి