Mohammad Azharuddin Birthday Special: టీమిండియా మాజీ క్రికెట్ దిగ్గజం మొహమ్మద్ అజారుద్దీన్ బర్త్ డే నేడు. ఫిబ్రవరి 8న అజారుద్దీన్ తన 60వ బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. మూడు ఫార్మాట్లలోనూ సక్సెస్ ఫుల్ క్రికెటర్ అనిపించుకున్న అజారుద్దీన్ ఎందుకు వివాదాస్పదంగా క్రికెట్ నుంచి దూరం కావాల్సి వచ్చింది..? క్రికెట్లో అజారుద్దీన్ బద్దలు కొట్టిన రికార్డులు ఏంటి ? పర్సనల్ లైఫ్ సంగతులు ఏంటనే విషయాలు బ్రీఫ్‌గా తెలుసుకుందాం.

మొహమ్మద్ అజారుద్దీన్ టెస్ట్ కెరీర్లోకి అడుగుపెట్టిన తరువాత ఆడిన తొలి మూడు మ్యాచుల్లోనూ సెంచరీలు చేశాడు. ఈ అరుదైన రికార్డు సొంతం చేసుకున్న క్రికెటర్‌గా మొహమ్మద్ అజారుద్దీన్ పేరు పదిలంగా నిలిచిపోయింది. వచ్చీ రావడంతోనే సెంచరీలు చేయడంతో కెరీర్ ఆరంభంలోనే ఎనలేని క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ( Twitter Photo )
టీమిండియా కెప్టేన్గానూ మొహమ్మద్ అజారుద్దీన్ ఘనమైన రికార్డు సొంతం చేసుకున్నాడు. 174 వన్డే మ్యాచులక్ కెప్టేన్‌గా నేతృత్వం వహించిన మొహమ్మద్ అజారుద్దీన్.. 90 మ్యాచుల్లో దేశానికి విక్టరీ అందించాడు. అత్యధిక వరల్డ్ కప్స్‌కి నేతృత్వం వహించిన కెప్టేన్గానూ మొహమ్మద్ అజారుద్దీన్ రికార్డు సొంతం చేసుకున్నాడు. 1992, 1996, 1999 వరల్డ్ కప్ టోర్నీలకు మొహమ్మద్ అజారుద్దీన్ కెప్టేన్‌గా వ్యవహరించాడు. ( Twitter Photo )
మొహమ్మద్ అజారుద్దీన్ 2000 సంవత్సరంలో సౌతాఫ్రికన్ కెప్టేన్ హన్సి క్రోంజిని బుకీలకు పరిచయం చేసి స్పాట్ ఫిక్సింగ్‌కి పాల్పడ్డాడు అంటూ సీబీఐ దర్యాప్తులో తేలడంతో ఐసిసి, బిసిసిఐ మొహమ్మద్ అజారుద్దీన్ని క్రికెట్ నుంచి నిషేదిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నాయి. అజారుద్దీన్‌పై నిషేధం విధించడం అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. ( Twitter Photo )
2009లో మొహమ్మద్ అజారుద్దీన్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. అదే సంవత్సరం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర్ ప్రదేశ్‌లోని మొరాదాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచాడు. ( Twitter Photo )
బాలీవుడ్ హీరోయిన్, సల్మాన్ ఖాన్ ప్రేయసిగా పేరున్న సంగీతా బిజ్లానిని రెండో పెళ్లి చేసుకున్న మొహమ్మద్ అజారుద్దీన్ మొహమ్మద్ అజారుద్దీన్ వ్యక్తిగత జీవితం పలు ఒడిదుడుకులతోనే సాగింది. మొదటి భార్య నౌరీన్‌కు 1996లో విడాకులు ఇచ్చి అదే ఏడాది బాలీవుడ్ హీరోయిన్ సంగీతా బిజ్లానిని రెండో పెళ్లి చేసుకున్నాడు. కానీ సంగీతా బిజ్లానితో వైవాహిక జీవితం కూడా ముందుకు సాగలేదు. 2010 లో సంగీతా బిజ్లాని, మొహమ్మద్ అజారుద్దీన్ ఇద్దరూ డైవర్స్ తీసుకుని విడిపోయారు. ( Twitter Photo )