Chiranjeevi House: బాబోయ్.. ఇది ఇల్లు కాదు.. రాజభవనం.. చిరంజీవి ఇంటి లేటెస్ట్ పిక్స్ చూశారా..!

Chiranjeevi House Inside Pics: మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ తరువాత ఫామ్‌లో ఉన్నారు. వరుసగా సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. త్వరలో విశ్వంభర మూవీతో ఆడియన్స్‌ను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. బింబిసార డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో రూపొందుతోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. సినిమాల విషయం పక్కనబెడితే.. చిరంజీవి ఇంటిని మీరు ఎప్పుడైనా చూశారా..? సకాల సౌకర్యాలతో ప్యాలెస్‌లా ఉండే ఆ ఇంటిపై మీరూ ఓ లుక్కేయండి. 
 

1 /9

తన తమ్ముడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కావడంంతో చిరంజీవి ఫుల్ హ్యాపీగా ఉన్నారు. పవన్ ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత మెగాస్టారీ ఆశీర్వాదం తీసుకున్న క్షణాలు అభిమానుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతాయి.  

2 /9

68 ఏళ్ల వయసులోనూ కుర్ర హీరోలకు దీటుగా డ్యాన్స్‌లు, ఫైట్స్‌తో చిరంజీవి ఆడియన్స్‌ను మెప్పిస్తున్నారు. ఒక్కో మూవీకి మెగాస్టార్ రూ.50 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం.  

3 /9

చిరంజీవి లైఫ్‌ స్టైల్‌ కూడా లగ్జరీగా ఉంటుంది. ఆయన ఇంటి పిక్స్‌ను మీరు చూసేయండి.  

4 /9

చిరంజీవి ఇల్లు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో కొండపై ఉంటుంది. మెగాస్టార్ విలాసవంతమైన ఇల్లు చూస్తే ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే..  

5 /9

మెగాస్టార్ ఇల్లు డిజైన్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఇందులో అన్ని సౌకర్యాలు ఉన్నాయి.  

6 /9

ఈ ఇంటి నిర్మాణం కోసం రూ.33 కోట్లు వెచ్చించినట్లు తెలుస్తోంది.    

7 /9

మెగాస్టార్ ఇంటి ముందు స్విమ్మింగ్ పూల్ ఉంది. ఉదయించే సూర్యుని అందాలను ఆస్వాదించే విధంగా నిర్మించారు.   

8 /9

చిరంజీవి ఇంటి కింది అంతస్తులో దేవుడి గది ఉంది. దేవుడి గదిని కూడా చాలా అందంగా తీర్చిదిద్దారు.  

9 /9

చిరంజీవికి హైదరాబాద్‌లోనే కాకుండా బెంగళూరులో కూడా అందమైన ఇల్లు కూడా ఉంది. అప్పుడప్పుడు కుటుంబంతో కలిసి అక్కడికి వెళ్లి వస్తుంటారు.