Mahakumbh Mela 2025: మహా కుంభమేళాలో మరో అద్భుతం అయోధ్య రామ మందిరం.. తప్పక చూడాల్సిందే..

Mahakumbh Mela 2025: భారతదేశ చరిత్రలోనే 12 పుష్కరాల తర్వాత అంటే 144 యేళ్లకు  ఒకసారి వచ్చే మహా కుంభమేళా గంగా,యమునా, సరస్వతిల సంగమ స్థానమైన ప్రయాగ్ రాజ్ లో పుష్య పౌర్ణమి (జనవరి 13) నుంచి జరుగుతోంది. ఇప్పటికే దాదాపు 20 కోట్ట మంది మహా కుంభమేళాలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. తాజాగా తెలుగు వారికి సంబంధించిన శ్రేయాస్ మీడియా మహా కుంభమేళాలో భాగమైంది. అంతేకాదు అక్కడ అద్భుతమైన రామ మందిరం సెట్టింగ్ తో అందరిని అలరిస్తోంది.

 

1 /7

Mahakumbh Mela 2025: మహా కుంభమేళాలో అఘోరాలు, నాగ సాదువులు, పండితులు, సామాన్య జనాలు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. ఉదయం నుంచే సంగమ స్థానంలో భక్తులు పోటెత్తుతున్న ఎక్కడ ఎలాంటి అవాంచీనీయ సంఘటనలు జరగుకుండా ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది.

2 /7

తాజాగా ప్రయాగ్ రాజ్ లో జరగుతోన్న మహా కుంభమేళాలో భాగమైనందకు ఎంతో గర్వంగా ఉందని చెబుతున్నారు తెలంగాణ రాజధాని హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్ మీడియాస్ వెల్లడించారు.

3 /7

ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళ జరుగుతున్న ఆధ్యాశ్రీ ఇన్ఫోటైన్మెంట్ & బిజ్ భాష్ ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి పనిచేయడం తమకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నానన్నారు. 

4 /7

ఈ మహా కుంభమేళా దిగ్విజయంగా  సాగడానికి ముఖ్య కారణమైన గౌరవనీయులు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి, సాంస్కృతి & పర్యాటక మంత్రి వర్యులకు ,అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

5 /7

అదేవిధంగా ఈ కార్యక్రమానికి గాను ఎంతో కష్టపడి పగలు రాత్రి తేడా లేకుండా దైవ సేవగా భావిస్తూ 25 రోజులపాటు అయోధ్య రామ మందిరాన్ని ప్రయాగ్ రాజ్ లో మళ్లీ  రీ క్రియేట్ చేసారు. దీని కోసం వెయ్యి మందికి పైగా పనిచేసిన విషయాన్ని ప్రస్తావించారు. వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు.

6 /7

ఈ మహా కుంభమేళా భారతదేశంలోని తాము చూసిన అత్యంత దైవత్వం కలిగిన ఈవెంట్ గా పేర్కొన్నారు. ఎంతో భక్తి శ్రద్ధలతో తాము ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. కుంభమేళాకు వచ్చిన భక్తులందరికీ అయోధ్య రామ మందిరం ఎలా ఉంటుందో అనేది కంటికి కట్టినట్లు చూపించాలి అనే ఆలోచన ఎంతో గొప్పదన్నారు.

7 /7

దాని నిర్వర్తించడంలో తాము తమ సాయశక్తుల కష్టపడి భక్తిశ్రద్ధలతో పనిచేసినట్లు తెలుపుతూ దీనికి కారణమైన ప్రతి ఒక్కరికి తాము రుణపడి ఉంటామని శ్రేయస్ మీడియా తెలిపారు.